రెండు సినిమాలు రెడీ అంటున్న యేలేటి

Update: 2016-08-04 22:30 GMT
ఎంతో ప్ర‌తిభ ఉన్నా 13 ఏళ్ల వ్య‌వ‌ధిలో ఆరంటే ఆరే సినిమాలు చేశాడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. సాహ‌సం వ‌చ్చిన మూడేళ్ల‌కు ఇప్పుడు మ‌న‌మంతా సినిమాతో ప‌ల‌క‌రిస్తున్నాడు. ఐతే తాను స్క్రిప్టు త‌యారు చేయ‌డంలో స్లో కావ‌డంతో పాటు ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల త‌న కెరీర్లో గ్యాప్ వ‌చ్చింద‌ని.. ఐతే ఇక‌పై స్పీడుగా సినిమాలు చేస్తాన‌ని అంటున్నాడు యేలేటి. మ‌నమంతా విడుద‌ల‌వ్వ‌గానే రెండు రెండేళ్ల‌లో రెండు సినిమాలు చేయ‌డానికి తాను సిద్ధ‌మై ఉన్న‌ట్లు యేలేటి చెప్పాడు.

నాకు స్టోరీ - స్ర్కీన్ ప్లే రాసి డైరెక్ష‌న్ చేయ‌డానికి ఏడాది.. ఏడాదిన్న‌ర‌ ప‌డుతుంది. నా తొలి సినిమా త‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్- ప్ర‌త్యూష ల‌తో సినిమా చేయాల‌నుకున్నాను. ఆగిపోయింది. అలాగే ప్ర‌యాణం త‌ర్వాత కూడా ఓ సినిమా ఆగిపోయింది. ఇంకొంచెం స్పీడుగా చేస్తే నేను ఎక్కువ సినిమాలు చేయ‌గ‌ల‌ను. ఐతే మ‌న‌మంతా త‌ర్వాత రెండు సినిమాల క‌థ‌లు ఓకే అయ్యాయి. నిర్మాత‌లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక‌పై వేగంగా సినిమాలు పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తా. ఐతే న‌టీన‌టులు ఎవ‌రు.. ఏది ముందు చేస్తాను అన్న‌ది ఇంకా నిర్ణ‌యించుకోలేదు అని యేలేటి చెప్పాడు.

ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన సినిమాల్లో ఊపిరి.. క్ష‌ణం బాగా న‌చ్చాయని.. తాను ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ తీరిక చేసుకుని ఈ రెండు సినిమాలూ చేశాన‌ని యేలేటి చెప్పాడు. ఇంత‌కుముందు ప్ర‌యాణం సినిమాతో నిర్మాత‌గా మారాన‌ని.. మ‌ళ్లీ ఇంకేదైనా ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేయాల‌నుకుంటే సొంత బేన‌ర్లో చే్స్తాన‌ని యేలేటి అన్నాడు.
Tags:    

Similar News