ఆ డైరెక్టర్‌ను ఆడియన్స్‌ మిస్సవుతున్నారు

Update: 2015-07-02 06:56 GMT
కమర్షియల్‌ సినిమాలు తీయడంలో మన తెలుగు డైరెక్టర్ల తర్వాతే ఎవరైనా. కానీ కొత్త కథలతో భిన్నమైన సినిమాలు తీసే డైరెక్టర్ల కొరత మాత్రం మనకు బాగా ఉంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో కూడా కమర్షియల్‌ సినిమాలు వస్తాయి. కానీ వాటితో పాటు ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ సినిమాలు కూడా పుడుతుంటాయి. ఎప్పుడూ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మన దగ్గర డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో సినిమాలు తక్కువ. కొత్త కథలతో ప్రయోగాలు చేసే దర్శకులూ అరుదే. వైవిధ్యం కోసం తపించే అతి తక్కువ మంది డైరెక్టర్లలో చంద్రశేఖర్‌ ఏలేటి ఒకడు.

ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం.. ఈ సినిమాలే చెబుతాయి ఏలేటి ఎంత భిన్నంగా ఆలోచిస్తాడో. అతడి సినిమాలన్నీ కమర్షియల్‌ సక్సెస్‌ సాధించి ఉండకపోవచ్చు. కానీ ఏలేటికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అతడికంటూ ఓ అభిమాన వర్గాన్ని సంపాదించి పెట్టాయి. ఐతే ఆ అభిమానులు తమ ఫేవరెట్‌ డైరెక్టర్‌ సినిమాల్లేకుండా ఖాళీగా కూర్చోవడం చూసి ఆవేదన చెందుతున్నారు. ఏలేటి చివరి సినిమా సాహసం ఫ్లాపేమీ కాలేదు. కానీ పెట్టిన ఖర్చుకు తగ్గట్లు వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో మనోడికి ఇంకో ఛాన్స్‌ ఇచ్చేవాళ్లు కనిపించడం లేదు. అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి.. ఏలేటితో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఏదైనా కథ మీద వర్కవుట్‌ చేస్తున్నాడా.. లేక నిర్మాత కోసం వెదుకుతున్నాడా తెలియట్లేదు కానీ.. ఏలేటి మాత్రం వార్తల్లో లేడు. ఇలాంటి మంచి డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చే నిర్మాతే లేడా టాలీవుడ్‌లో?



Tags:    

Similar News