ఛాన్స్ ఇవ్వమంటే ముక్కు బాగోలేదు.. పేరు మార్చుకోవాలన్నారట

Update: 2020-03-09 05:24 GMT
ఇవాల్టి రోజున బాలీవుడ్ టాప్ ముద్దుగుమ్ముల జాబితా తీస్తే.. అందులో కనిపించే ప్రధానమైన పేర్లలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకటి. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. తనదైన స్థానాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇవాల్టి రోజున జాక్వెలిన్ అంటే ఒక బ్రాండ్ అన్న స్థాయికి ఎదిగారు.

అలాంటి ఈ శ్రీలంక సుందరికి బాలీవుడ్ లోఅవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురైనట్లుగా చెప్పుకొచ్చారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో.. ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరంగా చెప్పుకొచ్చారు.

సినిమాల్లో అవకాశాల కోసం శ్రీలంక నుంచి ముంబయికి షిఫ్ట్ అయిన వేళ.. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారంటూ ఎవరూ లేరన్నారు. తన ఒంటరి ప్రయాణం లో..హీరోయిన్ గా ఛాన్సుల కోసం పలువురి వద్దకు వెళ్లానని గుర్తు చేసుకున్నాను. ఈ సందర్భంగా ముక్కు బాగోలేదన్న మాటను ఎదుర్కొన్నానని.. మరి కొందరైతే జాక్వెలిన్ ఏమిటి? పేరు బాగోలేదు.. ముస్కాన్ అని మార్చేసుకో అని సలహా ఇచ్చినట్లు గా చెప్పారు. ఇలా సలహాలు ఇచ్చినోళ్లు ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

కానీ.. తాను మాత్రం పేరు మార్చుకోలేదన్నారు. నటిగా పదేళ్ల ప్రయాణం లో తాను పలు అవకాశాల్ని సొంతం చేసుకున్న తనకు అప్పుడప్పుడు తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న విమర్శలు.. సలహాలు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ నవ్వొస్తుందని చెప్పుకొచ్చింది. సక్సెస్ పలుకరించే వరకూ ఇలాంటి తిప్పలు తప్పవు. కాకుంటే.. టాప్ స్థానానికి చేరుకున్న తర్వాత కూడా తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని గుర్తు పెట్టుకోవటంలోనే జాక్వెలిన్ తానెలాంటి దానినన్న విషయం ఇట్టే చెప్పేస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News