క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - రాకింగ్ స్టార్ రాఖీభాయ్ యష్ ల కలయికలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కేజీఎఫ్ 2'. యావత్ దేశం మొత్తం దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూసింది. చాప్టర్ 1 కంప్లీట్ గా ప్రేక్షకుల్ని కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి తీసుకెళ్లిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాఖీ భాజ్ఞ్ పెర్ఫార్మెన్స్ కు జేజేలు పలికారు. దీంతో చాప్టర్ 2పై అంచనాలు అంబరాన్నంటాయ. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు 'కేజీఎఫ్ 2' ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. యష్ యాంగ్రీ యంగ్ మెన్ గా రాఖీభాయ్ పాత్రలో ఒదిగిపోయిన తీరు, అతని స్టైల్, ప్రశాంత్ నీల్ టెర్రిఫిక్ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే, బీజీఎమ్స్ తో రవి బాస్రూర్ అదరగొట్టిన విధానం.. హాలీవుడ్ సినిమాలని తలపించే స్థాయి సినిమాటోగ్రఫీని భువన్ గౌడ అందించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. స్టార్స్ తో పాటు సమాన్య జనం రాఖీ భాయ్ కి ఫిదా అయిపోయారు.
రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ వరుసగా రికార్డులని బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 750 కోట్ల మార్కుని దాటి సంచలనం సృష్టిస్తోంది. హిందీలో త్వరలో 300 కోట్ల మార్కుని దాటబోతోంది. సర్వత్రా చర్చనీయాంశంగా నిలిచిన ఈ మూవీపై ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. 'కేజీఎఫ్2' ఓ టెర్రిఫిక్ బ్లాక్ బస్టర్ అంటూ కితాబిచ్చారు.
తాజాగా ఈ జాబితాలో మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ చేరారు. ఇటీవలే సినిమా చూసిన చరణ్ వన్ లైనర్స్ తో సినిమాపై ప్రత్యేక రివ్యూని అందించి ఆశ్చర్య పరిచారు. యష్ నటన మైండ్ బ్లోయింగ్ అని, కేజీఎఫ్ 2 మూవీ ఓ అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాకుండా ఇందులో నటించిన కీలక నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం విశేషం. సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా చరణ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఏ స్టార్ హీరో కూడా ఈ రేంజ్ లో ఏ బ్లాక్ బస్టర్ సినిమాకు రివ్యూ ఇవ్వని విధంగా చరణ్ రివ్యూ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. అంతే కాకుండా సినిమాలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ ని మించి చరణ్ రాఖీ భాయ్ ని ఎలివేట్ చేసిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 'కేజీఎఫ్ 2' సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు నా బ్రదర్ యష్ కు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు టీమ్ అందరికి శుభాకాంక్షలు. యష్ నటన మైండ్ బ్లోయింగ్.. స్క్రీన్ ప్రజెక్స్ చాలా కమాండింగ్ గా కనిపించాడు. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ గారు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఇప్పటి వరకు ఇదే వారి అత్యుత్తమ నటన అనిపించేలా వుంది. శ్రీనిధి శెట్టి, మాళవిక అవినాష్, ఈశ్వరీరావు, అర్చనా జోయిస్, రవి బాస్రూర్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ అద్భుతమైన పనితీరుని ప్రదర్శించారు. సాంకేతిక నిపుణులందరికి కుదోస్' అని పేర్కొన్నారు. చరణ్ పంచుకున్న ఈ పోస్ట్ ఇప్పడు నెట్టంట వైరల్ గా మారింది. చరణ్ పొగడ్తల వర్షాన్ని చూసిన వారంతా చరణ్ ఎలివేషన్ ప్రశాంత్ ని మించిపోయిందే అంటున్నారు.