ఫోటో స్టోరీ: హాట్ సిస్టర్స్.. ప్లాంక్ కసరత్తులు

Update: 2020-03-30 06:45 GMT
సోషల్ మీడియాలో కొంచెం అయినా యాక్టివ్ గా ఉండే వారికి నేహ శర్మ పేరు తెలియకుండా ఉండదు.  'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముంబై భామ సినిమాల్లో పెద్దగా సాధించిందేమీ లేదు కానీ హాటు ఫోటో షూట్లు.. ఇన్స్టాగ్రామ్ పోస్టులతో మాత్రం విపరీతమైన గుర్తింపు సాధించింది.  ఈ వేడి నెమ్మదిగా బాలీవుడ్ మేకర్లకు కూడా తగలడంతో ఈమధ్య హిందీ ఆఫర్లు కూడా  వస్తున్నాయి.

నేహ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. ఒక రోజు అన్నం తినడం మానెయ్.. అంటే మానేస్తుందేమో కానీ కసరత్తులు మానెయ్ అని చెప్తే మాత్రం ఊరుకోదు.  ఈమధ్యే భారతదేశానికి పెద్ద తాళం వేసి "ఇంట్లోనే కూర్చుండి భాయియో.. బెహనో" అంటూ మోడీగారు చెప్పారు కదా.. అందుకే నేహ కూడా ఇంట్లో కూర్చుంటోంది.  నేహకున్న ఒకే ఒక చిట్టి చెల్లి.. హాటు బుల్లి ఐష కూడా ఇంట్లోనే కూర్చుంది.  ఇద్దరూ డాబా పైకి ఎక్కి అక్కడ సంక్రాంతి సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పోటీ పడుతూ కసరత్తులు చేస్తున్నారు.  కత్తి లాంటి స్పోర్ట్స్ డ్రస్సులు ధరించి ప్లాంక్ ఎక్సర్ సైజులు చేస్తూ ఆ ఫోటోలను ఎత్తి ఇన్స్టా లో పడేసి "ఒక నిముషం చాలా త్వరగా గడిచిపోతుందని అనుకునే వారెవరూ ఎప్పుడూ ఈ ప్లాంక్ ఎక్సర్ సైజ్ చేసి ఉండరు. #డే 4 క్వారంటైన్ #హై ప్లాంక్" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.

పాప చెప్పేది నిజమే.  ఆ ప్లాంక్ ఎక్సర్ సైజ్ ఏదో రెండు సెకన్లు.. మూడు సెకన్లు చెయ్యమంటే ఎలాంటి జఫ్ఫా అయినా చేస్తాడు కానీ అలానే వాడిని ఒంగోబెట్టి "ఓ.. కా.. టి - రెం.. డూ -  మూ.. ....డు" అని కౌంట్ చేస్తే చాలు.  వాడికి పట్టిన శతకోటి దరిద్రాలు క్షణంలో గాయబ్. ఏదేమైనా ఈ అక్క చెల్లెలు ఇద్దరూ సభ్య సమాజానికి కసరత్తుల సందేశం ఇస్తూ ఆ.. విధంగా ముందుకు పోతున్నారు.  సరేలెండి.. "మందు షాపులు తెలంగాణాలో రోజూ రెండు గంటలు తెరుస్తారు" ఫేక్ జీఓ లు సోషల్ మీడియాలో విడుదల చేసి మద్యపాన ప్రియుల మనోభావాలను దెబ్బ తియ్యకుండా ఈ ప్లాంకుల తో సరి పెడుతున్నారు. ఆ ప్రాంకుల కంటే ఈ ప్లాంకులు ఎంతో మేలు!
Tags:    

Similar News