టాటా గ్రూప్ తో చ‌ర‌ణ్ మంత‌నాలు!

Update: 2022-02-10 06:31 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల ముంబైలో ఎక్కువ‌గా క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తొలుత సోద‌రి శ్రీజ తో క‌లిసి చ‌ర‌ణ్ ముంబైలో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. దీంతో చ‌ర‌ణ్ -శ్రీజ ప‌నిమీద త‌న‌కు తోడుగా ముంబై వెళ్లిన‌ట్లు ప్ర‌చారం సాగింది. అటుపై భార్య ఉపాస‌న‌తో క‌లిసి అదే ముంబై చ‌ర‌ణ్ లో క‌నిపించారు. దీంతో రామ‌రాజు సీరియ‌స్ ప‌నిమీద‌నే తిరుగుతున్నార‌ని క్లార‌టీ వ‌చ్చింది. తాజాగా ఆ ప‌నులేంటి?  అన్న దానిపై ఆరాలు తీయ‌గా బిజినెస్ వ్య‌వ‌హారాల్లోనే చ‌ర‌ణ్ త‌ల‌మున‌క‌లైన‌ట్లు వినిపిస్తోంది. ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీతో బిగ్ డీల్ కుదుర్చుకునే ప‌నిలో భాగంగానే ముంబై టూ హైద‌రాబాద్ తిరుగుతున్నార‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

బాలీవుడ్..కోలీవుడ్  చిత్రాలు నిర్మించే ఓ పెద్ద కార్పోరేట్ తో ఒప్పంద విష‌యంపై చ‌ర‌ణ్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. స‌ద‌రు కంపెనీ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ లో భాగ‌స్వామ్యం చేయాల‌నే ఉద్దేశంతోనే చ‌ర‌ణ్  సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారుట‌ . మ‌రి శ్రీజ‌-ఉపాస‌న‌లు ఎందుకు ముంబై వెళ్లిన‌ట్లు అంటే  మెగా ఫ్యామిలీ ఇంట వ్యాపారాల్లో శ్రీజ‌-ఉపాస‌న కూడా భాగ‌స్వాములుగా ఉండ‌టంతో వాళ్ల అవ‌స‌రం కూడా స‌ద‌రు కార్పోరేట్ కంపెనీలు కోర‌డంతో వాళ్లిద్ద‌రు కూడా వేర్వేరుగా వెళ్లిన‌ట్లు టాక్ న‌డుస్తోంది.

మ‌రి చ‌ర‌ణ్ చేస్తోన్న ఈ ప్లానింగ్ వెనుక అస‌లు క‌థ ఏంటి? అంటే చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` తో పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

భ‌విష్య‌త్ బిజినెస్ మార్కెట్ ని కూడా ఆ రేంజ్ లో బిల్డ్ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ క‌మిట్ మెంట్లు కూడా అలాగే ఉన్నాయి. పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో  సినిమా చేయ‌డం..`జెర్సీ` ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ని లాక్ చేయ‌డం వంటి అంశాలు చ‌ర‌ణ్ ప్లానింగ్ ని తెలియ‌జేస్తున్నాయి.

 ఇదే చ‌ర‌ణ్ ముంబై టూర్ వెనుక అస‌లు క‌థ ని కొంత మంది అనుమానిస్తుండ‌గా...చ‌ర‌ణ్ కి చెందిన ట్రూజ్ జెట్ విమాన‌యాన సంస్థ‌కు సంబంధించి ఎయిర్ ఇండియాతో టై అప్ దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నార‌ని ...చ‌ర‌ణ్ అందుకే ముంబై లో ఉంటున్నాడ‌ని అంటున్నారు.

ఇటీవ‌లే ఎయిర్ ఇండియాని  టాటా గ్రూప్ కి చేరిన సంగ‌తి తెలిసిందే. ట్రూజెట్  బిజినెస్ ని విస్త‌రించే ప్ర‌క్రియ‌లో భాగంగానే చ‌ర‌ణ్ టాటాతో టైప్ అప్ దిశ‌గా మంత‌నాలు చేస్తున్న‌ట్లు గుస‌గుస‌ వినిపిస్తోంది.
Tags:    

Similar News