మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ట్రిపుల్ ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలని సైతం సొంతం చేసుకుంది.
వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడమే కాకుండా హాలీవుడ్ నటుల, రచయితల ప్రశంసల్ని సైతం దక్కించుకుంది. ఇటీవల హాలీవుడ్ క్రేజీ మూవీ 'డాక్టర్ స్ట్రేంజ్' రైటర్ 'ట్రిపుల్ ఆర్' పై ప్రశంసల వర్షం కురిపించారు.
వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నా ఈ మూవీ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా రూపొందతున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
ఇప్పటికే కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. త్వరలో హైదరాబాద్ లో మరో కీలక షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీలో శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, అంజలి, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న మూవీ కోసం 'సర్కారోడు', అధికారి వంటి టైటిట్స్ ప్రచారంలో వున్నాయి. 1930 కాలం నేపథ్యంలో సాగే పీరియడిక్ డ్రామాగా ఈ మూవీని పాస్ట్... ప్రజెంట్ ల కథతో తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ తరువాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడన్నది ప్రస్తుంత ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ తరువాత చరణ్ 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్ తో ఓ భారీ యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ తరువాత వెంటనే గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాలనుకున్న చరణ్ తాజాగా మనసు మార్చుకుని అతని స్థానంలో లోకేష్ కనగరాజ్ తో మూవీని ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా చేసిన చిత్రం 'విక్రమ్'. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు మల్టీవర్స్ ని సృష్టించాలని ప్లాన్ చేస్తున్న లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంలో కమల్ మనవడిగా నటించిన పాత్రతో రామ్ చరణ్ వెర్షన్ ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారట. ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే ఈ వార్తలపై లోకేష్ కనగరాజ్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.