అమలను అరెస్ట్ చేయక తప్పదా?

Update: 2018-06-18 11:21 GMT
చేసిన తప్పుకి పరిహారం చెల్లించక తప్పదు.. నిజం ఎన్నాళ్లో దాగదు.. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. ఇలాంటి సామెతలు నీతులు చాలానే వింటూ ఉంటాం కానీ.. ఇవన్నీ సామాన్యులకు మాత్రమే సెలబ్రిటీల విషయంలో ఎలాంటి చట్టాలు చెల్లవు అని అందరూ అనుకుంటూ ఉంటారు.

కానీ సినిమాల్లో తరచుగా వినిపించే డైలాగ్ మాదిరిగానే.. చట్టం తన పని తాను చేసుకుపోవడం అనే పాయింట్.. అమలా పాల్ విషయంలో నిజమవుతోంది. కొంత కాలం క్రితం ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసిన అమలా పాల్.. ఆ కారును తాను నివాసం ఉంటున్న కేరళలో కాకుండా.. తక్కువ పన్నులు కట్టేందుకు పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించడం ఇందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం తెలిసిన విషయమే. ఈ కేసు ఇప్పుడు తీవ్రతరం అవుతోంది. అమలాపాల్ కు కష్టాలను కొనితేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేసు విషయంలో దర్యాప్తును ఇప్పటికే పూర్తి చేశారు పోలీసులు.

అమలాపాల్ అందించిన చిరునామాలో ఆమె ఉండడం లేదంటూ ఆ ఇంటి యజమాని తేల్చేయడంతో.. త్వరలో ఈమెపై ఛార్జి షీట్ ఫైల్ చేయనున్నారట. ఆమెకు సమన్లు కూడా జారీ కానున్నాయని అంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లు ఇవ్వడం పెద్ద నేరమే కావడంతో.. ఈమెక కోర్టుకు కూడా హాజరు కాక తప్పని పరిస్థితి. కేసు ప్రూవ్ అయితే శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందంటున్నారు న్యాయ నిపుణులు.



Tags:    

Similar News