దాదాపు పదిహేనేళ్ల పాటు కథానాయికగా కొనసాగింది ఛార్మి. కానీ అప్పుడెప్పుడూ లేని ఆనందం తన జీవితంలో ఇప్పుడు కనిపిస్తోందని ఆమె చెప్పింది. హీరోయిన్ గా కంటే నిర్మాతగా ఉండటాన్నే తాను ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నానని.. ఇది తన జీవితంలో బెస్ట్ ఫేజ్ అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. ఇందుకు కారణాలేంటో ఛార్మి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘కథానాయికగా ఉన్నపుడు ఉదయాన్నే నిద్ర లేవాల్సి వచ్చేది. వర్కవుట్లు చేయాల్సి వచ్చేది. తిండి విషయంలో చాలా నియంత్రణ పాటించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ కష్టాలేవీ లేవు. లేటుగా నిద్ర లేవాలనిపిస్తే అలానే చేస్తా. పని చేయాలనే మూడ్ లేకుంటే సైలెంటుగా ఉంటా. నటిస్తున్నపుడు కేవలం నటన మీద మాత్రమే దృష్టి ఉండేది. ఇప్పుడు సినిమాకు సంబంధించి 24 విభాగాల గురించి తెలుసుకుంటున్నాను. ఫిల్మ్ ప్రొడక్షన్ చాలా ఛాలెంజింగ్ గా.. ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది. సినిమా తీయడం.. పోస్ట్ ప్రొడక్షన్ చేయడం.. పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయడం.. ఇవన్నీ పెద్ద టాస్క్. ఇందులో చాలా కిక్కు కూడా ఉంటుంది.
‘మెహబూబా’ సినిమాకు పని చేయడం ద్వారా ఒక సంపూర్ణత వచ్చిన భావన కలిగింది. ఒక సమయంలో సంవత్సరానికి ఆరు సినిమాలు చేశాను. కానీ అప్పుడు ఈ ఫీలింగ్ కలగలేదు. మెహబూబా ట్రైలర్ బాగుంది. సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తోంది. కథానాయికగా చాలా డబ్బు సంపాదించినపుడు కూడా లేని ఆనందం ఇప్పుడు కలుగుతోంది. అందుకే ఇదే నా జీవితంలో బెస్ట్ ఫేజ్ అని చెబుతున్నా’’ అని ఛార్మి చెప్పింది. తన జీవితాంతం సినిమాల్లోనే కొనసాగుతానని.. ఐతే దర్శకత్వం లాంటి వాటి జోలికి వెళ్లే ఉద్దేశాలు తనకు లేవని ఛార్మి స్పష్టం చేసింది.