పాపం ఛార్మి.. ఈసారి ఎలాగైనా తన సత్తాను చూపించేయాలని ఆరాటపడుతుంటే.. ఏదో ఒక అవాంతరం ఆమెను వెంటాడేస్తోంది. ''జ్యోతిలక్ష్మి'' సినిమాతో టాలీవుడ్ చరిత్రనే తిరగరాయాలని చూస్తోంది అమ్మడు. దానికి తగ్గట్లే సినిమాను డైరక్ట్ చేస్తోంది ది గ్రేట్ పూరి జగన్ కాబట్టి, ఖచ్చితంగా మనోడు ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడని అందరి నమ్మకం. ఇకపోతే ఈ సినిమాను గోవాలో షూటింగ్ చేస్తుండగా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది.
ఒక స్టంట్ సీక్వెన్సును షూట్ చేస్తున్నప్పుడు, ఛార్మి తలపై కొట్టాల్సిన ఒక ఫైటర్, ఒక హాకీ బ్యాట్‌తో పొరపాటును ఆమె ముఖంపై కొట్టేశాడట. దాని కారణంగా ఛార్మి ముఖం గీసుకుపోయి, దెబ్బతో వాచి ఊబ్బిపోయింది. బలబలామంటూ ఏడుస్తున్న ఛార్మిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించగా, ఓ ఆరు గంటల్లో ఆమెకు రిలీఫ్ దక్కిందట. అరే ముఖం పచ్చడైపోయింది కదా, ఇక షూటింగ్ క్యాన్సిల్ ఏమో అని అందరూ అనుకుంటుంటే, తేరుకున్న ఛార్మి వెంటనే షూటింగ్లో పాల్గొని మిగిలిన యాక్షన్ సీక్వెన్సులను కూడా కంప్లీట్ చేసింది. వాటే కమిట్మెంట్ గురూ!!