ఛార్మి వేదాంతం.. ఎందులకో!!!

Update: 2017-07-14 07:48 GMT
‘అనుకోకుండా ఒక రోజు’  సినిమా హీరోయిన్గా గుర్తింపు పొందిన ఛార్మి ఈ మధ్య కాలం లో తెలుగు తెర పై కనిపించడం మానేసింది అనే చెప్పాలి. జ్యోతి లక్ష్మి సినిమాలో లీడ్ రోల్ చేసినా అనుకున్నంతగా ఆడకపోయేసరికి మన తెలుగు సినిమాలలో చెప్పుకోదగ్గ అవకాశాలు ఏమి రాలేదు. రాబోతున్న బాలకృష్ణ పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న ‘పైసా వసూల్’ సినిమాకు ఆమె ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేస్తోంది. సినిమాలు ఏమీ చేయకపోయాన సోషల్ మీడియాలో ఛార్మికి మంచి ఫాలోయింగే ఉందిలే.

తన తోటి హీరోయిన్లతో పార్టీల్లో అప్పుడుప్పుడు సరదాగా విహారాలు చేస్తున్న ఛార్మి కొన్ని రోజులు కిందట గురుద్వార్ కు పొట్టి బట్టలు వేసుకువెళ్లి చీవాట్లు తిన్నది. అయితే ఇప్పుడు ఛార్మి అల్లరి కాస్త వేదాంతంగా మారినట్లు ఉంది. ఏదో ఒక విదంగా వైరల్ అవుతున్న ఛార్మి ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్  చూసే వారికి మాత్రం ఒక ప్రశ్న మిగిలిచి పోయింది. ఛార్మి ఏమి అన్నది అంటే  “నీ చుట్టూ ఉన్నవారు నిన్ను హేళన చేసి చిన్నబుచ్చినా.. నువ్వు ఏమీ బాధ పడవలిసిన అవసరం లేదు. అలా వాళ్ళు చేస్తున్నారు అంటే అది కేవలం నీ దైర్యంను దెబ్బ తీయడానికే. నువ్వు వాళ్ళకన్నా గొప్పగా ఆలోచిస్తేనే నిన్ను ఇలా అవమానపరుస్తారు'' అంటూ మెసేజ్ ఇచ్చింది అమ్మడు.

అయితే ఇప్పుడు ఛార్మి పేరు డ్రగ్స్ తీసుకుంటున్నవారి లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్నప్పుడు.. అమ్మడు ఈ వేదాంతం ఎందుకు చెబుతోందంటారు? తనను తాను నిర్ధోషిగా ప్రకటించుకునే ప్రయత్నం చేస్తోందని కొందరు.. అబ్బే అసలు ఛార్మి నిజంగానే అమాయకురాలు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అది సంగతి.
Tags:    

Similar News