ఫొటోటాక్ : 16 ఏళ్ల తర్వాత 'చత్రపతి' అమ్మ కొడుకు

Update: 2021-07-25 08:33 GMT
ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చత్రపతి సినిమా విడుదల అయ్యి 16 ఏళ్లు అవుతుంది. సినిమా ఈమద్య విడుదల అయినట్లే అనిపించేంత ఫ్రెష్‌ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ప్రభాస్‌ చత్రపతి సినిమా లో కీలక సన్నివేశం ప్రతి ఒక్కరికి ఎప్పటికి గుర్తు ఉండి పోతుంది. ప్రభాస్‌ అప్పటి వరకు కూల్‌ గా ఉండి.. రౌడీల వద్ద పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సూరీడు అనే కుర్రాడిని కొడతారో అప్పుడు ప్రభాస్ లోని ఉగ్ర స్వరూపం బయట పడుతుంది. అప్పటి నుండి సినిమా మొత్తం మారి పోతుంది. ఒక గుడ్డి తల్లికి చిన్న పిల్లాడు అయిన కొడుకు సూరీడు.. ఆ పిల్లాడిని కొట్టి పడేయడంతో ప్రభాస్‌ కు చత్రపతికి కోపం వస్తుంది. సినిమాలోని గుడ్డి తల్లిగా అనిత చౌదరి నటించగా.. పిల్లాడు సూరీడుగా భశ్వంత్‌ వంశీ నటించాడు.

సినిమాలో సూరీడుగా భశ్వంత్‌ చాలా చిన్న పిల్లాడుగా కనిపించాడు. అయిదు అయిదు ఆరు ఏళ్లు ఉండి ఉంటాయి. అప్పట్లోనే సూరీడు పాత్రకు జీవం పోసినట్లుగా నటించాడు. ఆ తర్వాత కనిపించని భశ్వంత్‌ ఈమద్య సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాడు. కాని ఆయన గురించి ఇన్నాళ్లు ఎవరు పట్టించుకోలేదు. కాని ఇప్పుడు మాత్రం అతడి గురించి చర్చ జరుగుతుంది. ఈ ఫొటో కారణంగా భశ్వంత్‌ వంశీ గురించి చత్రపతి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు.

అనిత చౌదరి మరియు భశ్వంత్‌ వంశీలు కలిసి తీసుకున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 16 ఏళ్ల క్రితం తల్లి కొడుకులుగా నటించిన వీరిద్దరు మళ్లీ ఇన్నాళ్లకు ఒకే ఫ్రేమ్‌ లో కనిపించడంతో అంతా కూడా కన్నుల పండుగ అన్నట్లుగా చూస్తున్నారు. ఈ ఫొటోను తెగ షేర్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. భశ్వంత్‌ చూడబోతుంటే హీరోగా ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గడ్డం మీసాలు వచ్చిన చత్రపతి సూరీడు ఇప్పుడు గుర్తు పట్టనంతగా మారిపోయాడు.
Tags:    

Similar News