సమంత రూత్ ప్రభు తో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య కెరీర్ మీదే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ దూకుడు చూపిస్తున్నారు. ప్రస్తుతం 'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్స్ తో బిజీ బిజీగా తిరుగుతున్న చైతూ.. తాజాగా తన చేతిపై ఉన్న టాటూ అర్థం ఏమిటో వెల్లడించాడు.
పెళ్లి తర్వాత నాగచైతన్య - సమంత జంట తమ ప్రేమకు గుర్తుగా కొన్ని టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే. చై తన చేతి మీద పచ్చబొట్టు ఉంటుంది. అది మామూలు టాటూ కాదు.. దాని వెనుక నిఘాడ అర్థం ఉంది. ఈ విషయాన్ని వెల్లడించిన చైతన్య.. దాన్ని వేసుకోవద్దని తన అభిమానులను కోరాడు.
మోర్స్ కోడ్ టాటూలో తన పెళ్లి తేదీ ఉందని నాగచైతన్య వెల్లడించారు. 2017, అక్టోబర్ 6న సామ్ ను ప్రేమ వివాహం చేసుకున్న చైతన్య.. ఆ తేదీనే టాటూగా వేయించుకున్నాడు. అయితే విడాకుల తర్వాత పచ్చబొట్టును తొలగించే ఆలోచన కూడా చేయలేదని చైతూ పేర్కొన్నాడు.
చేతిపై ఉన్న టాటూ గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. "ఈ మధ్య నా పేరును టాటూలు వేయించుకున్న కొందరు ఫ్యాన్స్ ను కలిశాను. వారిలో ఈ పచ్చబొట్టును అనుకరించినవారున్నారు. కానీ ఇది మీరు ఫాలో కావాల్సిన టాటూ కాదు. ఎందుకంటే ఇది నా పెళ్లి రోజు. అందుకే దానిని ఒంటిపై వేయించుకోవాలని కోరుకోను'' అని అన్నారు.
అభిమానులు ఇలాంటి టాటూ వేయించుకున్నప్పుడు బాధగా ఉంటుంది. పరిస్థితులు మారుతూ ఉంటాయి.. టాటూలు కూడా మారిపోవచ్చు అని చైతన్య అన్నారు. టాటూని తొలగించడం లేదా మార్చడం గురించి ఆలోచించారా అని అడిగినప్పుడు.. "నేను ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించలేదు. మార్చడానికి ఏమీ లేదు. ఇట్స్ ఫైన్" అని చై చెప్పారు.
ఇదిలా ఉంటే సమంత తన ఒంటిపై చై ప్రేమకు గుర్తుగా మూడు చోట్ల వేయించుకున్న పచ్చబొట్లు వేయించుకుంది. నాగచైతన్య - సమంత కలిసి నటించిన మొదటి సినిమా 'ఏమాయ చేసావే' గుర్తుగా తన వీపుపై ymc అనే టాటూ వేయించుకుంది. అలానే నడుముకి పైభాగంలో 'చై' అని టాటూ ఉంటుంది. చై చేతి మీదున్న టాటూ మాదిరిగానే సామ్ కుడి చేతి మీద రెండు బాణపు గుర్తుల పచ్చబొట్టు ఉంటుంది.
ఇకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్న చై సామ్.. నాలుగేళ్లకే విడిపోయారు. గతేడాది అక్టోబర్ లో ఇద్దరూ విడిపోతున్నట్లు ఉమ్మడిగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే విడాకుల గురించి స్పందించారు. ఇటీవలే 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో చైతూతో సఖ్యతగా లేదనే విధంగా సమంత మాట్లాడింది.
చైతన్య మాత్రం సామ్ పై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని అన్నాడు. భవిష్యత్తులో తామిద్దరం కలిసి నటిస్తామో? లేదో? తెలియదు కానీ.. అది జరిగితే మాత్రం క్రేజీగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. నాగ చైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చద్దా' ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదల కానుంది.