నాగ చైతన్య -సమంతా రూత్ ప్రభు గత ఏడాది విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ బ్రేకప్ పై మీడియాలో రకరకాల ఊహాజనిత కథనాలు వెలువడ్డాయి. చైతన్య వృత్తిగత జీవితం కంటే తన వ్యక్తిగత జీవితం గురించి రాస్తుండడం బాధ కలిగించిందని అప్పట్లో అన్నారు. తన వృత్తి గురించి రాయాలని మీడియాని అభ్యర్థించాడు.
తాజాగా బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో ఉన్న నాగార్జున ఇటీవలే ముంబైకి వెళ్లారు. అక్కడ మీడియాతోను ఇంటరాక్ట్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో నాగార్జున తనయుని బ్రేకప్ పైనా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. దీని గురించి నాగ్ మాట్లాడుతూ.. "అతను(నాగచైతన్య) సంతోషంగా ఉన్నాడు.. నేను చూస్తున్నది అంతే. అది నాకు సరిపోతుంది!" అని అన్నారు. "ఇది(విడాకులు) అతడి (చైతూ) అనుభవం. దురదృష్టకరం. ఇంకా దాని గురించి ఆలోచించలేం. ఇట్స్ గాన్.. మన జీవితానికి దూరంగా ఉంది. కాబట్టి ఇది(దూరమైన విధి) అందరి జీవితాల్లోంచి బయటపడుతుందని ఆశిస్తున్నా" అన్నారు నాగార్జున అక్కినేని.
రీమేక్ కల్చర్ పైనా నాగ్ ని ప్రశ్నించగా షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చాలా సౌత్ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. తన సినిమా ఏదైనా హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారా? అని నాగార్జునను ప్రశ్నించగా..
"వీళ్లంతా సినిమాలను రీమేక్ చేయడం మానేయాలి. అందరూ OTTలో అన్ని సినిమాలను చూస్తున్నారు. అందుకే ఇవి ఆపేయాలి. అందరూ ప్రతి సినిమాని ఓటీటీలో చూస్తారు.. పోలికలు చెబుతారు. సినిమాలను రీమేక్ చేయడం మానేయాలి. నేను వ్యక్తిగతంగా రీమేక్ లు చేయాలనుకోను" అని నాగార్జున అక్కినేని అన్నారు.
ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రజలు పాన్ ఇండియాకు చేరుకుంటున్నారు. అయితే థియేటర్లలో కాదు... ఓటీటీలో. సినిమాలన్నీ విడుదలవుతున్నాయి. ముందుగా నా సినిమాలన్నీ హిందీలో డబ్ అవడం వల్ల నాకు భారీ మార్కెట్ వస్తుంది. ముఖ్యంగా యాక్షన్ చిత్రాలన్నీ డబ్ అవుతాయి. ఆపై అవి OTTలో వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాటిని చూస్తున్నారు. నేను దుబాయ్ లేదా ఎక్కడికైనా వెళితే అరబ్బులు నన్ను గుర్తిస్తారు. వారికి నా పేరు కూడా తెలియదు.
కానీ మేము ఆ సినిమా చూశాం" అని చెబుతారు.. అంటూ ఓటీటీ ట్రెండ్ గురించి నాగ్ విశదపరిచారు. మారిన ట్రెండ్ లో రీమేక్ లు సరికావనేది నాగార్జున అభిప్రాయం. అయాన్ ముఖర్జీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ'లో కింగ్ నాగార్జున నటనకు హిందీ ఆడియెన్ మంచి మార్కులే వేసారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.