ఒక అందమైన అమ్మాయి కండోమ్ లు అమ్మితే యువజనం ఊరుకుంటారా? అది కూడా వీధుల వెంట తిరిగేస్తూ మా కంపెనీ కండోమ్ లు కొనండి అని అడగడంతో చెలరేగిపోరూ.. ఇప్పుడు ఇదే పాయింట్ తో సోషల్ మీడియాల్లో ఆ పాత్రలో కనిపించిన నుష్రత్ భరుచ్చా ని ఒక రేంజులో ట్రోల్ చేస్తున్నారు. కండోమ్‌ల వాడకాన్ని ఆమోదించే జన్ హిత్ మే జారీ అనే టైటిల్ తో మరో అసాధారణ చిత్రంలో నుస్రత్ నటించారు. ఈ చిత్రం ఆమెను బోల్డ్ అవతార్ లో చూపించనుంది.
నుస్రత్ ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ లను పంచుకుంది. ఈ పోస్టర్లలో ఆమె కచ్ఛితంగా మా కండోమ్ లు కొనాలి అంటూ దబాయించేస్తోంది. ఇది చూసాక చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో చౌకబారు వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై ఆవేదన చెందుతూ నుష్రత్ సోషల్ మీడియా ద్వారా వారికి తగిన సమాధానం ఇచ్చారు.
నుష్రత్ భరుచ్చా నటిగా ఇప్పటికే నిరూపించుకుంది. కెరీర్ లో వరుసగా అసాధారణమైన చిత్రాలను చేస్తున్న నటిగా పేరు తెచ్చుకుంది. జన్ హిత్ మే జారీ లో కూడా విభిన్న పాత్రను పోషించింది. కండోమ్ ల ప్రచారకర్తగా పని చేసే మహిళగా కనిపిస్తోంది. అందుకే తనని ఉద్దేశించి యువతరం సామాజిక మాధ్యమాల్లో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రత్యుత్తరంలో వారు ఏమి చెప్పినా తన కోసం తాను నిలబడతానని గట్టిగా చెప్పింది.
ట్రోల్స్.. మీమ్ లపై తాను గతంలో ఎప్పుడూ స్పందించలేదని ఎందుకంటే వాటిని ఎప్పుడూ చదవలేదని నుష్రత్ ఇటీవల పేర్కొంది. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా వాటిని ఎప్పుడూ చదవనని ఆమె స్పష్టం చేసింది. అయితే ఆమె ఈసారి చదివినప్పుడు తన టీమ్ తన స్వరాన్ని పెంచాలని కోరారట. ఇలా ఎదురించడమే ఉత్తమ మార్గం అని ఇప్పుడు నుస్రత్ భావించింది.
మరోవైపు ఈ చిత్రంలో ఆమె ఎందుకు ఇలాంటి బోల్డ్ పాత్రను తీసుకోవాలని నిర్ణయించుకుంది? అనే దాని గురించి ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ- "నేను వన్-లైనర్ విన్న క్షణం నుండి జాన్ హిత్ మే జారి అనే కాన్సెప్ట్ పై ఆసక్తిగా ఉన్నాను.
అటువంటి హుష్-హుష్ విషయం గురించి బిగ్గరగా మాట్లాడగలగడం.. కుటుంబ ప్రేక్షకులను మెప్పించే హాస్యం ఇందులో ఉండడం .. ఆడవారి కోణం నుండి కథ నడవడం వగైరా కారణాలు నన్ను స్క్రిప్ట్ వైపు ఆకర్షించాయి.. అని తెలిపారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించగా.. జన్హిత్ మే జారీని వినోద్ భానుశాలి నిర్మించారు. జూన్ 10న ఈ సినిమా భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.