ఈ రోజు రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి లోక నాయకుడు నటించిన చీకటి రాజ్యం అయితే రెండోది ప్రేమ కథల ప్పెషలిస్ట్ సుకుమార్ రైటింగ్ లో రూపొందిన కుమారి 21ఎఫ్. ఉత్తమ నటుడు నటించడంతో చీకటి రాజ్యం చిత్రానికి అలాగే సుకుమార్ నిర్మిస్తూ. కథ - కథనాలు అందించడంతో కుమారి చిత్రానికి చాలా హైప్ వచ్చింది. రెండూ కూడా విభిన్నమైన కాన్సెప్ట్ లతో రూపొందినవే. ఇందులో చీకటి రాజ్యం యాక్షన్ థ్రిల్లర్ గా మంచి మార్కులు కొట్టేస్తే , సుకుమార్ కుమారి మాత్రం బోల్డ్ ఎంటర్ టైనర్ గా విమర్శలు ఎదుర్కొంటుంది. సుకుమార్ నుంచి సినిమా వస్తుందంటే సాధారణ ప్రేక్షకుడి నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ఈ సారి కి మా త్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి సారీ చెప్పేసేలా ఉన్నాడు. ఎందుకంటే అంత బోల్డ్ గా తీశాడు మరి.
సినిమా అంత సుకుమార్ స్టయిల్ లోనే సినిమా సాగినా హీరో – హీరోయిన్స్ మద్య వచ్చే సీన్స్ మరీ బోల్డ్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.తీసుకున్న కాన్సెప్ట్ మంచిదే అయినా చెప్పే పద్ధతి మాత్రం హద్దులు దాటింది. దీంతో దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం కాక తప్పదు. సెన్సార్ వారు సైతం చిత్రం లో మునుపెన్నడూ తెలుగు చిత్రాలలో చూడని బోల్డ్ సన్నివేశాలు , డైలాగ్స్ ఉన్నాయని ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిన కానీ సినిమాలో ఇంకా అలాంటి చాలా సన్నివేశాలు ఉండడం తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు…ఇది తెలుసుకొని సుకుమార్ ఆ సన్నివేశాలను కట్ చేస్తాడా లేక ఫ్యామిలీ ఆడియన్స్ అవసరం లేదని ఈ సారికి సారీ చెప్పేస్తాడో చూడాలి.