లెజెండరీ దర్శకుడు మణి రత్నం సినిమాలు అంటే ఎప్పటికీ జనాల్లో క్రేజ్ ఉంటుంది. ఆ మధ్య ఫామ్ కోల్పోయిన ఆయన.. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాకు. లేటెస్ట్ ట్రెండ్ కి.. జనరేషన్ కి తగినట్లుగా సినిమాలు చేసేస్తోన్నారు. కార్తి, అదితిరావు హైదరి జంటగా నటించిన కాట్రు వెలియిదాల్ చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేసేసిన మణిరత్నం.. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిపోయారు.
తెలుగులో ఈ మూవీని చెలియా పేరుతో అనువదించగా.. దిల్ రాజు నిర్మాణంలో తెలుగు వెర్షన్ వస్తోంది. అందుకే ఈ చిత్రంపై ఆసక్తి మరింతగా పెరిగింది. అయితే చెలియా రిలీజ్ డేట్ పై ఇప్పుడు హీరో కార్తి నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే ఏప్రిల్ 7నే చెలియను రంగంలోకి దించేస్తున్నారు. తమిళ్ వెర్షన్ విషయంలో ఈ డేట్ పై ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా.. తెలుగుకు వచ్చేసరికే సమస్య వస్తోంది. అదే డేట్ కి ఇక్కడ వెంకటేష్ గురు.. మోహన్ లాల్-అల్లు శిరీష్ నటించిన 1971-భారత సరిహద్దులను షెడ్యూల్ చేశారు. పైగా పవన్ కాటమరాయుడు ఇంకా థియేటర్లలోనే ఉంటుంది.
వీటికి తోడు.. రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ లు నటించిన జగ్గా జాసూస్.. అమితాబ్ తో రాంగోపాల్ వర్మ తీసిన సర్కార్3.. కమల్ చిన్నకూతురు అక్షర నటించిన లాలీ కీ షాదీ మే లడ్డూ దీవానా చిత్రాలు కూడా అదే రోజున విడుదలవుతున్నాయి. ఇవి మల్టీప్లెక్సులను ఆక్రమించేయడం ఖాయమే. చుట్టూ ఇన్నేసి సినిమాలున్నా.. చెలియ మాత్రం థియేటర్లలో కలియతిరిగేందుకు రెడీ అయిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/