పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత తన అభిమానుల ముందుకు వకీల్ సాబ్ రూపంలో బరిలోకొచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై క్రిటిక్స్ ప్రశంసలతో పాటు సినీప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకుముందే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని వీక్షించి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ లోని వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దర్శకనిర్మాతలు దిల్ రాజు- వేణు శ్రీరామ్ బృందాన్ని ఆయన అభినందించగా.. ఆ ఇద్దరూ నేడు చిరుని ఆయన స్వగృహంలో కలుసుకుని బ్లెస్సింగ్స్ అందుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి `వకీల్ సాబ్` సినిమాను చూడటానికి నిన్న సాయంత్రం గచ్చిబౌళిలోని AMB సినిమాస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. చిరు కుటుంబంతో పాటు నాగ బాబు ఫ్యామిలీ.. వైష్ణవ్ తేజ్- వరుణ్ తేజ్- సుష్మితా కొనిదేలా తదితరులు ఈ స్పెషల్ ప్రీమియర్ లో కనిపించారు.
తాజాగా వకీల్ సాబ్ మూవీని వీక్షించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన ఎమోషన్ ని ఒక స్పెషల్ నోట్ రూపంలో ఆవిష్కరించారు. ``సినిమా చూస్తున్నంత సేపూ కొన్ని పెర్ఫామెన్సెస్ ని ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమా నుంచి బయటికి వచ్చేప్పుడు ఒక ఆలోచనతో వెళతాం. కళ్యాణ్ బాబాయ్ మీ వకీల్ సాబ్ ఒక స్థాయి ఉన్న ప్రత్యేకమైన సినిమా. ప్రకాష్ రాజ్ గారు.. నివేద థామస్.. అంజలి.. అనన్య మీరంతా బ్రిలియంట్ గా నటించారు.
థమన్ వాట్ ఏ రీరికార్డింగ్ .. పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం ఎక్సలెంట్. వకీల్ సాబ్ లాంటి గొప్ప సినిమాను ఇచ్చినందుకు వేణు శ్రీరామ్ గారికి.. దిల్ రాజు- శిరీష్ బృందానికి థాంక్స్.. అంటూ ఎమోషన్ అయ్యారు.