మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. అనతి కాలంలోనే 'మెగా పవర్ స్టార్' గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. యాక్టింగ్ - ఫైట్స్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతీ దాంట్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న చెర్రీ.. ఇండస్ట్రీకి వచ్చి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "చిరుత" సినిమాతో రామ్ చరణ్ హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2007 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మెగా వారసుడి సినీ కెరీర్ కు సక్సెస్ ఫుల్ ఎంట్రీని అందించింది.
రెండో సినిమా 'మగధీర' తో ఇండస్ట్రీ రికార్డ్ సాధించిన రామ్ చరణ్.. 'రచ్చ' 'నాయక్' 'ఎవడు' 'ధృవ' వంటి సినిమాలతో విజయాలు సాధించారు. 'రంగస్థలం' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇదే క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని.. సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు చరణ్.
15 ఏళ్ల సినీ ప్రస్థానంలో 14 సినిమాల్లో నటించిన చెర్రీ.. ఈ జర్నీలో పరాజయాలు కూడా చవిచూశాడు. అయినా సరే ఏమాత్రం నిరుత్సాహ పడకుండా.. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సక్సెస్ అయ్యాడు. 'జంజీర్' వంటి క్లాసిక్ ను చెడగొట్టాడని విమర్శించిన బాలీవుడ్ జనాల నోళ్ళతోనే.. RRR చిత్రంతో ప్రశంసలు వర్షం కురిపించేలా చేసుకున్నాడు.
ప్రస్తుతం భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ తో RC15 సినిమా చేస్తున్నాడు చెర్రీ. హీరోగానే కాకుండా నిర్మాతగానూ మెగా వారసుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తన తండ్రితో సినిమాలు నిర్మిస్తున్నాడు. హోమ్ ప్రొడక్షన్ లో రూపొందిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా సందర్భంగా విడుదల కాబోతోంది.
ఇకపోతే 'మగధీర' 'బ్రూస్లీ' 'ఖైదీ నెం.150' వంటి చిత్రాల్లో తండ్రితో కలిసి కాసేపు నటించిన రామ్ చరణ్.. 'ఆచార్య' లో తొలిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇలా తన 15 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని మెమరబుల్ గా మార్చుకున్నారు. తనయుడు ఈ స్థాయికి చేరుకోవడం పై చిరు పుత్రోత్సాహం పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. "15 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా, సినిమాల్లో రామ్ చరణ్ ప్రయాణాన్ని ప్రేమగా ప్రతిబింబిస్తున్నాను. అతను నటుడిగా 'చిరుత' నుండి 'మగధీర' నుండి.. 'రంగస్థలం' నుండి RRR వరకు.. ఇప్పుడు దర్శకుడు శంకర్ తో #RC15కి ఎలా ఎదిగాడనేది చూస్తే హృదయపూర్వకంగా ఉంది"
"అతని ప్యాషన్ - వర్క్ - అంకితభావం మరియు అతను చేసే పనిలో రాణించాలనే పట్టుదల చూసి చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను మై బాయ్! మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని.. గొప్ప ఘనతలు సాధించాలని కోరుకుంటున్నాను. దానికి కావాల్సిన శక్తి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుకాక" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెర్రీ తో కలిసి ఉన్న ఓ ఫోటోని చిరు పంచుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.