ఇవాళ సోషల్ మీడియాతో పాటు అందరి మొబైల్స్ ఫ్రెండ్ షిప్ డే సందర్భాన్ని పురస్కరించుకుని విషెస్ తో హోరెత్తిపోతున్నాయి. సరైన టైమింగ్ చూసుకుని బాలీవుడ్ మూవీ చిచోరే ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్. సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ కావడంతో మనవాళ్ళకూ దీని మీద ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక కథ విషయానికి వస్తే అన్ని(సుశాంత్ రాజ్ పుత్)ఎన్నో ఆశలతో ఆశయాలతో కాలేజీలో అడుగు పెడతాడు. అక్కడ ఎందరో విభిన్న మనస్తత్వాలు కలిగిన స్నేహితులు తారసపడతారు. క్యాంపస్ మొత్తం ఆరాధ్య దేవతగా భావించే మాయ(శ్రద్దా కపూర్)ని ప్రేమిస్తాడు అన్ని.
ర్యాగింగ్ తో మొదలుకుని స్పోర్ట్స్ లో ప్రైజులు సాధించడం దాకా అందరూ కలిసి ఒక గ్రూప్ గా చేస్తారు. అన్ని మాయల పెళ్లవుతుంది.జీవితంలో వృద్ధాప్యం వచ్చాక ఈ జంటకు ఓ పెద్ద విషాదం ఎదురవుతుంది. అల్లారుముద్దుగా పెంచుకుని చేతికి వచ్చిన కొడుకు యాక్సిడెంట్ జరిగి ప్రాణాల మీదకు వస్తుంది. ఎక్కడెక్కడో సెటిల్ అయిన స్నేహితులు ఇప్పుడు దీనికోసమే రీ యునైట్ కావలసిన అవసరం పుడుతుంది. అప్పుడు ఏం జరిగిందో అనేదే ఈ చిచొరే
అమీర్ ఖాన్ దంగల్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులతో పాటు వసూళ్లను కొల్లగొట్టిన దర్శకుడు నితీష్ తివారి మరోసారి తన ఎమోషనల్ మేజిక్ ఇందులో చూపించాడు. ముఖ్యంగా కాలేజీ క్యాంపస్ లైఫ్ ని చిత్రీకరించిన తీరు గత కొన్నేళ్లలో ఎవరూ తీయలేదని చెప్పొచ్చు. అందులోనూ స్టూడెంట్ లైఫ్ నుంచి రిటైర్ అయ్యే దాకా ఒక బ్యాచ్ జీవితాన్ని ఆవిష్కరించడం కూడా కొత్తగా ఉంది.
Full View

వరుణ్ - తాహిర్ - నవీన్ - తుషార్ - సహర్ష్ - ప్రతీక్ అందరూ సహజసిద్ధమైన నటనతోజీవం పోశారు. టి సిరీస్ సంగీతం హుషారుగా ఉంది. మొత్తానికి యూత్ కి మాత్రమే కాదు ప్రతిఒక్కరికి స్పెషల్ మూవీగా నిలిచేలా కనిపిస్తున్న చిచోరే సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ట్రైలర్ ముందు ఏమో కానీ ఇప్పుడు మాత్రం అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.