విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వం వహించిన పులి అక్టోబర్ 1న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పులి దర్శకుడు చింబుదేవన్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్ మెంట్ వింటే అతడు కాస్త భయంతో ఉన్నట్టే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాని బాహుబలితో పోల్చి చూస్తున్నారు జనం. అందుకే ఈ జంకు.
మా సినిమాని మొదటి నుంచి బాహుబలితో పోల్చి చూస్తున్నారు. దయచేసి అలా చూడొద్దు ప్లీజ్. ఆ సినిమా వేరు. నా సినిమా వేరు. బాహుబలి సీరియస్ బ్యాక్ డ్రాప్ తో నడిచే సినిమా. భారీ యుద్ధాలు ఉన్నాయి అందులో. కానీ పులి కామెడీ, ఫన్ ఎలిమెంట్స్ తో సాగే సినిమా. ఇందులో యుద్ధాలేవీ ఉండవు. ఈ రెండిటికి పోలికే వద్దు. అయితే రెండూ పీరియడ్ డ్రామాలే కాబట్టి కాస్త పోలిక ఉంటుంది తప్ప వేరే ఇంకేదీ లేదు. పులిని చూడడానికి ఓపెన్ మైండ్ తో రండి. అప్పుడు సంతృప్తిగా థియేటర్ల నుంచి బైటికి వెళతారు అంటూ తన మనసులో ఉన్నదంతా బైట పెట్టాడు. సామాజిక మీడియా ప్రచారం చింబుదేవన్‌ని నిజంగానే భయపెట్టింది.
దీన్ని బట్టి మనకు ఓ విషయం అర్థం కావాలి. 600 కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలిని కొట్టాలంటే ఇప్పట్లో ఎవరి వల్లా కాదు. పులి వల్ల అవుతుందా.. అన్నది రిలీజయ్యాక వచ్చిన ఊపును బట్టే చెప్పాలి. విజువల్ గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్‌లో బాహుబలి అంతర్జాతీయ ప్రమాణాల్ని టచ్ చేసింది. దాంతో పోలిస్తే పులి విజువల్స్ పరంగా ఆ స్థాయిని టచ్ చేయలేకపోవచ్చని అతడు భావిస్తున్నాడేమో! ఏదేమైనా పులి ఒకడుగు వెనక్కి వేసినట్టే మరి.