కార్తీ హీరోగా రూపొందుతున్న చినబాబు టీజర్ విడుదలైంది. పాండి రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయేషా హీరోయిన్. అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో బులెట్ బండి నడుపుతూ రైతునని గర్వంగా చెప్పుకుని తిరిగే పాత్రలో కార్తీ బాగా సూట్ అయ్యాడు. ఇలాంటి గ్రామీణ నేపధ్యం ఉన్న సినిమాలు తమిళ్ లోనే ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఈ మధ్య వచ్చిన రంగస్థలం ఈ లెక్కను కూడా సరి చేసింది.చినబాబు కూడా అలాంటి నేపధ్యంలోనే ఉన్న సబ్జెక్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఇది వర్తమానంలో సాగే రైతు కథ. నాన్న పాత్రలో సత్యరాజ్ నటించగా పచ్చని పల్లెటూరిలో తన మానాన తాను పొలం దున్ననుకుంటూ సరదాగా స్నేహితులతో గడుపుతూ అవసరమైనప్పుడు తప్పు చేసిన వాళ్ళ పనిబట్టే చినబాబుగా కార్తీ అందులో ఒదిగిపోయాడు. కాకపోతే నేపధ్యం మొత్తం తమిళ్ నేటివిటీతో ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ మాత్రం టీజర్ లో కనిపించింది.
కార్తీ దీని మీద చాలా హోప్స్ తో ఉన్నాడు. కాష్మోరా పరాజయం తర్వాత ఓ రెండు తమిళ సినిమాలు కనీసం తెలుగులో డబ్ కూడా చేయలేదు. కారణం అవి అక్కడే దారుణంగా పరాజయం పాలు కావడం. సో ఇప్పుడు కోలీవుడ్ లో సైతం సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు కార్తీ. ఇమ్మాన్ నేపధ్య సంగీతం బాగా అమరగా వేల్ రాజ్ కెమెరా పనితనం విజువల్స్ ని రిచ్ గా చూపించాయి. నువ్వు రైతువైతే కలర్ ఎగరేసుకుని తిరుగు అంతే-ఖర్చు కానిది బంధుత్వమే లాంటి డైలాగ్స్ ద్వారా ఎమోషన్స్ ని బాగా పండించినట్టే కనిపిస్తోంది. సత్య రాజ్ పాత్ర రెగ్యులర్ గానే ఉండగా సెటప్ మొత్తం మనం ఎన్నడూ చూడనిది అయితే కాదు. క్యాచీగా ఉండే చినబాబు టైటిల్ గతంలో నాగార్జున ఓసారి వాడుకున్నాడు. ముప్పై ఏళ్ళ క్రితం ఇదే పేరుతో నాగ్ సినిమా వచ్చింది. దాని తర్వాత ఇన్నాళ్లకు చినబాబుగా వస్తున్న కార్తీ ఎంతవరకు మెప్పిస్తాడో విడుదల అయ్యాక చూడాలి.
Full View