గాయని చిన్మయి వర్సెస్ లిరిసిస్ట్ వైరముత్తు ఎపిసోడ్స్ తెలిసినవే. ఓ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తనని ఒంటరిగా గదికి రావాల్సిందిగా పిలిచాడని వైరముత్తుపై చిన్మయి ఆరోపించారు. మీటూ వేదికగా వైరముత్తు వేధింపుల ప్రహసనాన్ని చిన్మయి బయటపెట్టారు. ఆ తర్వాత దానిపై సీరియస్ గా విచారణ సాగినా ఫైనల్ రిజల్ట్ పై చిన్మయి అసంతృప్తిని వ్యక్తం చేయడమే గాక.. నాటి నుంచి ఇప్పటికీ వైరముత్తు బాధిత మహిళల జాబితాను సోషల్ మీడియాల్లో స్క్రీన్ షాట్ల రూపంలో తనవైన రాతల రూపంలో బహిర్గతం చేస్తూనే ఉన్నారు.
మీటూ ఉద్యమం సాగుతున్నా అత్తమామల ఒత్తిడితో బయటికి చెప్పుకోలేకపోయిన ఓ అబల గురించి తాజాగా చిన్మయి ప్రస్థావించారు. తాను కాలేజ్ గాళ్ గా ఉండగానే వైరముత్తు పరిచయం అయ్యారని అప్పట్లో తన ఫోన్ నంబర్ పేపర్ పై రాసిస్తే తాను అర్థం చేసుకోలేకపోయానని ఆ అమ్మాయి అన్నారు. అయితే తాను ఓ టీవీ చానెల్లో ఉద్యోగిగా చేరాక మరోసారి వైరముత్తు తనని కలిసారట. టీవీ కార్యక్రమం అనంతరం తన ఫోన్ నంబర్ తీసుకుని పదే పదే ఫోన్ చేశారని కూడా చిన్మయికి వెల్లడించిన వాట్సాప్ చాట్లను స్క్రీన్ చాట్లు తీసి మరీ ప్రచారం చేయడం సంచలనమైంది.
సదరు చానెల్ ఉద్యోగి తనకు చాలా కాలంగా తెలుసని చెప్పిన చిన్మయి.. రెండేళ్ల క్రితం నాటి విషయం ఇది అని చాలా సంగతులే తెలిపారు. కుటుంబీకుల మద్ధతు లేక అత్తమామలు ఒప్పుకోకపోవడం వల్లనే ఆవిడ మీటూ వేదికపై లైంగిక వేధింపుల్ని బయటపెట్టలేకపోయిందట. ``నాకు తరచూ ఫోన్ చేస్తూ సంక్షిప్త సందేశాలు పంపుతూ వేధిస్తూనే ఉన్నాడు. అతని ఛేష్టలకు షాక్ అయ్యా. మౌంట్ రోడ్డు దగ్గరున్న ఓ చోటుకు రమ్మని పిలుస్తూనే ఉన్నాడు.. అంటూ చెప్పింది చానెల్ ఉద్యోగి. గంటకు 50సార్లు కాల్ చేసిన సందర్భాలున్నాయని వెల్లడించారు. ఇక తాను పని చేసే చానెల్ యాజమాన్యం పూనుకుని అతడి భార్యకు ఈ విషయం చెబితే తానే నోర్మూయించిందని వెల్లడించింది. పెద్దాయన ఈ ఏజ్ లో ఇవేం పాడుపనులు? అంటూ తిట్టేస్తున్నారు నెటిజనం.