సమంత గొంతు.. మాట భలే మార్చిందిగా

Update: 2017-01-19 16:44 GMT
తమిళనాడు అంతా ఇప్పుడు జల్లికట్టు చుట్టూతానే తిరుగుతోంది. వ్యతిరేకించిన ప్రతీ ఒక్కరికీ చీత్కారాలు తప్పడం లేదు. తిట్టిపోయడమే కాదు.. దాడులు చేసేందుకు కూడా వెనకాడ్డం లేదు తమిళ జనాలు. జంతు ప్రేమికురాలిగా జల్లికట్టును వ్యతిరేకించిన త్రిషకు.. ట్విట్టర్ వదిలి పారిపోవాల్సిన పరిస్థితి కల్పించారు.

ఇలాంటి సంఘటనలతో సూర్య.. నయనతార లాంటి స్టార్లతోపాటు ప్రముఖులంతా జల్లికట్టుకు మద్దతు పలుకుతున్నారు. తాజాగా సమంతకు గొంతు అరువు ఇచ్చే చిన్మయి శ్రీపాద కూడా ఇదే పట్టింది. 'సీఎన్ఎన్ నెట్వర్క్ టీవీ 18'లో తాను జల్లికట్టును సపోర్ట్ చేస్తున్న వ్యాఖ్యలు వస్తున్నాయంటూ ట్వీట్ పెట్టింది చిన్మయి. ఇక్కడే ఆమె దొరికిపోయింది. కొన్నేళ్ల క్రితం తాను పెటా సపోర్టర్ ని అంటూ.. ఇలాంటి సాంప్రదాయాలు వద్దని పెట్టిన ట్వీట్ ను బయటకు తీసి ఆమెను విమర్శల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.

ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిల్లోనే ఇలా మాట్లాడుతోందనే సంగతి అందరికీ అర్ధం అయిపోయింది. సంస్కృతీ సంప్రదాయాలు ఎలాంటివైనా.. వాటి జోలికి వెళ్లి సెంటిమెంట్లపై రియాక్ట్ అయితే.. ఏళ్ల తర్వాతయినా ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుందని చిన్మయిని చూస్తే అర్ధమవుతుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News