యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ ''శేఖర్''. 'మ్యాన్ విత్ ది స్కార్' (మచ్చల మనిషి) అనేది దీనికి ఉపశీర్షిక. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మే 20న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ''శేఖర్'' ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. 'లవ్ గంటే మోగిందంట' 'కిన్నెర' వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో తాజాగా 'చిన్ని చిన్ని ప్రాణం' అనే మరో గీతాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
'చిన్ని చిన్ని ప్రాణం.. చిందులాడే పాదం.. నాకోసం నవ్వు పంచినా.. ఇన్నినాళ్ళ కాలం.. అందిరాని గగనం.. ఇష్టంగా నేలకొచ్చేనా..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. తల్లిదండ్రులకు తమ బిడ్డ మీద ఉండే ప్రేమ మరియు ఆప్యాయత అనురాగాలను ఈ సాంగ్ లో చూపించారు.
ఇందులో రాజశేఖర్ పోలీసాఫీసర్ గా కనిపించగా.. ఆత్మీయ రాజన్ అతని భార్యగా కనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సోల్ ఫుల్ మెలోడీకి స్వరాలు సమకూర్చారు. చిన్మయి - హైమత్ మహమ్మద్ కలిసి ఆలపించారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు మంచి సాహిత్యం అందించారు.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ''శేఖర్'' సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ లో 91వ చిత్రం. ఇది మలయాళ సూపర్ హిట్ 'జోసెఫ్' మూవీకి తెలుగు రీమేక్. ఇందులో రాజశేఖర్ - జీవితల కుమార్తె శివాని కీలక పాత్ర పోషించింది. తల్లి దర్శకత్వంలో శివాని తన తండ్రితో కలిసి తొలిసారిగా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.
వంకాయలపాటి మురళీ కృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్పొరేషన్ - సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్ - త్రిపురా క్రియేషన్స్ - టారాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బీరం సుధాకర్ రెడ్డి - శివాని రాజశేఖర్ - శివాత్మిక రాజశేఖర్ - బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
శేఖర్ సినిమాలో ముస్కాన్ - అభినవ్ గోమటం - కన్నడ కిషోర్ - సమీర్ - భరణి - రవివర్మ - శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. లక్ష్మీ భూపాల ఈ సినిమాకి మాటలు రాయగా.. మల్లిఖార్జున నారగాని సినిమాటోగ్రఫీ అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
Full View