స్టార్ హీరోలంతా వేగంగా సినిమాలు పూర్తి చేస్తే నిర్మాత కు ఎంతో మేలు చేసిన వాళ్లమవుతామని మెగాస్టార్ అవకాశం దొరికిన ప్రతిచోట చెబుతుంటారు. ఫ్లో పెరిగితే స్పీడ్ వల్ల నిర్మాత కు నిర్మాణ భారం తగ్గుతుంది...హీరోలు మరో సినిమాకు అదనంగా కాల్షీట్లు కేటాయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఏడాదికి ఒక సినిమా చేసే స్టార్ హీరో రెండు సినిమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా ప్రాక్టికల్ గా సాధ్యమా? అంటే.. ఇవన్నీ మాటల వరకే పరిమితం. ఒక సినిమా సెట్స్ కు వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి షూటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సమయం ఎక్కువైనా పట్టొచ్చు...తక్కువైనా పట్టొచ్చు.
సూపర్ స్టార్ మహేష్ ఏడాదికి రెండు సినిమాలు చేయాలని నాలుగేళ్ల క్రితం సంకల్పించాడు. కానీ చేయడం మాత్రం కుదరలేదని చాలా సందర్భాల్లో తెలిపాడు. అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణ మాత్రం 80 రోజుల్లోనే పూర్తి చేసినట్లు ప్రీ రిలీజ్ వేడుకల్లో మహేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా మహేష్ ని ప్రశంసించారు. వేగంగా సినిమాలు ఎలా చేయోలో మహేష్ ని చూసి నేర్చుకోవాలని పొగిడేసారు. అంతేకాదు మెగాస్టార్ -కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కూడా 90 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేయాలని చిరు కండీషన్ పెట్టినట్లు కూడా రివీల్ చేసారు.
అందుకు లోబడే కొరటాల పనిచేయాల్సి ఉంటుందని సూచనప్రాయంగా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజనులు కామెంట్లు కాస్త నెగిటివ్ గానే పడుతున్నాయి. 90 రోజుల్లో స్టార్ హీరో సినిమా చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అవుతుందా? అబ్బాయ్ రామ్ చరణ్ చిరు తో నిర్మిస్తోన్న సినిమా ని కొరటాల 90 రోజుల్లో పూర్తిచేయగలడా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు వేంగా సినిమాలు చేసే టాలీవుడ్ హీరోలు ఎంత మంది ఉన్నారో? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజమే చాలా మంది హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకుంటారు. కానీ తర్వాత ప్రాక్టికల్ గా పాజిబుల్ కాలేదని ఎస్కేప్ అవుతుంటారు. మరి ఈ కామెంట్లకు సమాధానం ఒక్కటే...మెగాస్టార్ 90 రోజుల్లో సినిమా పూర్తిచేసి రిలీజ్ చేయడమే.