ఇక మెగాస్టార్ గానే చిరంజీవి ముగింపు!

Update: 2022-11-29 06:13 GMT
149 సినిమాల వ‌ర‌కూ మెగాస్టార్ చిరంజీవి మెరుపులు ఎలా కొన‌సాగాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అప‌జ‌య‌మెరుగ‌ని న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. స‌రిగ్గా 150వ సినిమా ల్యాండ్ మార్క్ మూవీ కి చేరే స‌రికి ఒక్క‌సారిగా చిరంజీవి పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకున్నారు. ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించ‌డంతో దాదాపు తొమ్మిదేళ్ల పాటు మ్యాక‌ప్ కు దూర‌మ‌య్యారు.

అప్ప‌టివ‌ర‌కూ న‌టుడిగా సేవ‌లందించిన చిరంజీవి ప్ర‌జా నాయ‌కుడిగా సేవ‌లందించాల‌ని ఆ ర‌క‌మైన ట‌ర్న్ తీసుకున్నారు. కానీ అక్క‌డ ఆయన  ఆశించిన విధంగా కెరీర్ సాగ‌లేదు. చిరంజీవి లాంటి సౌమ్యుడు రాజ‌కీయాల్లో రాణంచాలేడ‌ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించి  నిష్ర్క‌మించారు. ఆ త‌ర్వాత తిరిగి మ‌ళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ అయ్యారు. 150వ సినిమాగా 'ఖైదీ నెంబర్ 150' లో న‌టించి భారీ స‌క్సెస్ అందుకుని  బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు.

ఆ త‌ర్వాత మెగాస్టార్ రాజ‌కీయాలు ప‌ట్టించుకున్న‌ది లేదు. ప‌లు పార్టీలు ఆహ్వానం ప‌లికిన‌ప్ప‌టికీ తిర‌స్క‌రించి న‌టుడిగానే కొన‌సాగారు. అయితే సోద‌రుడు జ‌న‌సేన పార్టీస్థాపించినా రాజ‌కీయా నాయ‌కుడిగా ఏ నాడు ఆయ‌న కామెంట్ చేయ‌లేదు. పీకే ప్ర‌యాణంలో స‌క్సెస్ అవ్వాల‌ని ఆకాక్షించారే త‌ప్ప‌! తాను మ‌ళ్లీ రాజ‌కీయుల చేస్తాన‌ని చెప్పింది లేదు.

అయినా మీడియాలో క‌థ‌నాలు మాత్రం ష‌రా మూములే. తాజాగా 53వ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రాత్రోవాల్లో ఆయ‌న మ‌న‌సులో మాట‌ని మ‌రోసారి బ‌య‌ట పెట్టారు. 'ప‌దేళ్లు విరామం తీసుకుని సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత  అభిమానులు రెట్టింపు అభిమానం చూపించారు త‌ప్ప త‌గ్గించ‌లేదు.  వాళ్లంద‌రికీ ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను.  ఇక ఎప్ప‌టికీ సినిమాలు వ‌దిలిపెట్ట‌ను.

ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ల అభిమానానికి..ప్రేమకి దాసుణ్ణే. ఆ ప్రేమే ఈ స్థాయిలో నిల‌బెట్టింది. నేను ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టాను. శివ శంక‌ర ప్ర‌సాద్ అనే నాకు చిరంజీవిగా జ‌న్మ‌నిచ్చింది చిత్ర ప‌రిశ్ర‌మ‌.. నా త‌ల్లిదండ్రుల‌కు ధ‌న్య‌వాదాలు. నేను సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌టం నా అదృష్టం' అని  అన్నారు.

ఆయ‌న వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి చిరంజీవి ఇక వెండి తెర‌కే అంకిత‌మ‌ని ఉద్ఘాటించిన‌ట్లు తెలుస్తోంది. న‌టుడిగానే ఆయ‌న సినీ ప్ర‌స్థానాన్ని ముగించాలి అని కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. మ‌ళ్లీ రాజ‌కీయాల‌లోకి వ‌స్తారా? అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అడ‌గ‌గా..దాని గురించి  మ‌నిద్ద‌రం  కూర్చుని త‌ర్వాత మాట్లాడుదాం అని న‌వ్వేసారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News