మెగాస్టార్ చిరంజీవికి వైజాగ్ తో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఆయన కెరీర్ తొలినాళ్లలో విశాఖ నగరంలో ఆ చుట్టుపక్కల పరిసరాల్లో లొకేషన్లనే ఎక్కువగా ఎంపిక చేసుకునేవారు. ఇక్కడ నటించాలంటే ఈ బీచ్ వాతావరణం లో షికార్ చేయాలంటే చిరు ఎంతో ఎమోషనల్ గా కనెక్టయ్యేవారు. దీనిని ప్రతిసారీ మెగాస్టార్ తన సినిమాల ఈవెంట్లలో చెబుతుంటారు. విశాఖలో ఏ ఈవెంట్ కి హాజరైనా విశాఖ వాసుల్లో ఉత్సాహం నింపుతుంటారు.
ఈసారి కూడా ఆయన విశాఖతో తన కనెక్షన్ గురించి మాట్లాడారు. అభిమానుల్లో ఉత్సాహం నింపారు. విశాఖకు వచ్చిన ప్రతిసారి ఉద్వేగానికి లోనవుతాను.. వైజాగ్ అంటే చాలా ఇష్టం.. నేను ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాను... అంటూ స్పీచ్ ని ప్రారంభించిన చిరు ఆరంభమే విశాఖ వాసులకు గాలం వేసారు. తనవైన ఛమక్కులతో కామెడీ టింజ్ తో వీరయ్య వేదికపై వీరంగమాడారు చిరు.
ముఖ్యంగా విశాఖ వాసుల గురించి ప్రస్థావిస్తూ.. ఇక్కడ మనుషులు చాలా మంచివారు అని ప్రశంసించారు. ఈ మధ్యనే ఇక్కడ స్థలం కొన్నాను.. నేను కూడా విశాఖవాసుడిని అవుతాను.. అంటూ వ్యాఖ్యానించారు. చిరు ఆ మాట అనగానే ఉత్తరాది అభిమానుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
ఇకపై తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖలోను పాదుకునేందుకు చిరు కృషి చేస్తారని కూడా వేదిక వద్ద చర్చ సాగింది. ప్రత్యేకించి ఆయన తన తదుపరి జీవితాన్ని విశాఖ భీమిలిలోనే గడుపుతానని త్వరలోనే ఇల్లు కూడా కట్టేస్తానని అనడంతో విశాఖ అభిమానుల్లో పూనకాలు పుట్టుకొచ్చాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.