చిరంజీవికి ముందంతా 'కూల్‌' కాలమే!!

Update: 2016-03-30 08:11 GMT
అసలు చిన్న కూతురు చెప్పకుండా పెళ్ళి చేసుకోవడమే మెగాస్టార్‌ చిరంజీవికి తీరని వేదని అయితే.. ఆమె పెళ్లయిన నాలుగేళ్లకే ఒక కూతురు పుట్టాక భర్తతో వివాదాలు వచ్చి డైవర్స్‌ తీసుకోవడం మరో వేదన. తండ్రిగా ఈ పరిణామాలు చిరంజీవి మనస్సును కలచి వేశాయి. ఇప్పుడు శ్రీజ పెళ్ళి చిరంజీవి ఏ రేంజులో చేశారంటే.. అయ్యో ఆ రోజు నాన్న మాట వినుంటే బాగుండేదే.. నేను ఆయన్ను ఎంత బాధించాను అంటూ శ్రీజ లైఫ్‌ లాంగ్‌ తన గతాన్ని తలుచుకుని కుమిలిపోయేలా ఆయన అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని చేశారు.

అయితే శ్రీజకు ఏదో చెప్పాలని చిరంజీవి ఉద్దేశ్యం కాదు కాని.. తన చిన్న కూతురు పెళ్ళి చేసుకోకుండా అలా ఇంటి పట్టునే ఉంటే ఆయన్ను బాధిస్తోందట. అందుకే ఆమె జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఆయన ఈ పెళ్ళి తంతు ముగించేశారు. దీనితో దాదాపు ఆయనకు అన్ని భారాలూ తీరిపోయినట్లే. ఇక మిగిలినదంతా 150వ సినిమా చేసి.. అక్కడి నుండి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడమే. పైగా ఇక ఎంతో 'కూల్‌'గా ఆయన ఎలాంటి స్టెప్పులైనా వేసుకోవచ్చు. రేపు 31న తన కూతురు రిసెప్షన్‌ ఫంక్షన్‌ కూడా అయిపోతే.. ఇక 150వ సినిమా పనులు మొదలెట్టుకోవచ్చు మరి.

ఎన్నాళ్ళనుండో అందని ద్రాక్ష టైపులో మెగా అభిమానులకు ఊరిస్తున్న ఆ 150వ సినిమా ముహూర్తం ఇకనైనా పడుతుందని.. చిరంజీవి హ్యాపీ హ్యపీగా తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇస్తారని ఆశిద్దాం.
Tags:    

Similar News