దక్షిణాది సినిమా సాధించిన ఘనతకు పురస్కార వేదికలెన్నో. సైమా అవార్డ్స్.. సంతోషం అవార్డ్స్ అంటూ మునుముందు బోలెడంత హంగామాను చూడబోతున్నాం. ప్రతియేటా గల్ఫ్ దేశాల్లో సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్ నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ అంగరంగ వైభవంగా సాగే ఈవెంట్ లో సౌత్ నాలుగు భాషల నుంచి స్టార్లు పాల్గొంటున్నారు. అవార్డులు అందుకుంటున్నారు. ఈసారి కూడా దోహా- ఖతార్ లో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న తెలుగు- కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను.. ఆగస్టు 16న తమిళ- మలయాళ చిత్రాలకు అవార్డులను అందించనున్నారు.
ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి.. మాలీవుడ్ నుంచి కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ గౌరవ అతిథులుగా హాజరవుతున్నారు. 15న తెలుగు- కన్నడ అవార్డుల్లో చిరు చేతుల మీదుగా అవార్డుల్ని అందిస్తారు. 16న తమిళ- మలయాళ చిత్రాల అవార్డుల్లో మోహన్ లాల్ సందడి ఉంటుంది. సైమా ప్రతినిథులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పురస్కార వేడుకల్లో తెలుగు- తమిళ- కన్నడ- మలయాళ రంగాలకు చెందిన స్టార్లు పాల్గొంటున్నారు. ఈ వేడుకలకు ఇద్దరు పద్మభూషణులు చిరు-లాల్ గౌరవ అతిధులుగా హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి-చరణ్ ఇద్దరినీ చూసుకునే వీలుందట.
సైమా వేడుకల్లో తెలుగు సినిమాల నుంచి రంగస్థలం- గీత గోవిందం-భరత్ అనే నేను- మహానటి చిత్రాలు అవార్డులకు పోటీ పడుతున్నాయి. ఈ వేదికపై సిట్టిబాబు (చరణ్) ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటారన్న ప్రచారం ఇప్పటికే ఉంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కి అవార్డు దక్కనుందట. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి- విబ్రి మీడియా బృంద ప్రసాద్ సైమా అవార్డుల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.