మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో రకరకాల విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఎన్నిక మునుపెన్నడూ లేనంత రసవత్తరమైన పోరుకు తావివ్వడంతో అందరి కళ్లు అటువైపే ఉన్నాయి. శివాజీ రాజా ప్యానెల్ .. నరేష్ ప్యానెల్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో అందరి చూపూ అటువైపే ఉందని అర్థమవుతోంది. ఓవైపు ఏపీ ఎన్నికల వేడి గురించి మాట్లాడుకుంటున్న వాళ్లు మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల గురించి మాట్లాడుకోవడం మరింత ఆసక్తిని పెంచుతోంది. సరిగ్గా ఇలాంటి సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున ఇచ్చిన ట్విస్టు అదిరిపోయింది. ఆ ఇద్దరూ ఒకే కార్ లో వచ్చి ఈ ఉదయమే ఓట్లు వేసి వెళ్లారు. దీంతో అసలు ఆ ఇద్దరి మధ్యా రహస్య భేటి జరిగిందా? అంటూ అభిమానులు ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. మహేష్ - సూపర్ స్టార్ కృష్ణ - చిరు- నాగబాబు ఓట్లు వేసి వెళ్లారు. ఇప్పటికే 472 ఓట్ల వరకూ (60%) పోల్ అయ్యాయన్న సమాచారం అందింది.
కలిసి ఒకే కార్‌లో వచ్చారు.. కార్ లో ఏం మంతనాలు సాగించారు? ఆ ఇద్దరి ఓట్లు ఎవరికి పడ్డాయి? అన్న ముచ్చటా సాగుతోంది. ఇక అఖిల్ హీరోయిన్ సయేషా ప్రీవెడ్డింగ్ (హైదరాబాద్) వేడుకకు కింగ్ అటెండయ్యారో లేదో కానీ.. ఇప్పటివరకూ ఆయన సందడికి సంబంధించిన ఫోటోలేవీ బయటపడలేదు. అలాగే అఖిల్ వెళ్లినట్టు కూడా ఆధారం కనిపించలేదు. అయితే మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు కింగ్ విచ్చేయడం ఆసక్తిని పెంచింది. మాటీవీ వ్యవస్థాపకులుగా చిరు- నాగార్జున జోడీకి ఉన్న స్నేహం గురించి తెలిసిందే. స్నేహితులిద్దరూ ఓటింగ్ కి కలిసే రావడం ఉత్కంఠ పెంచింది. ఇక ప్రతిష్ఠాత్మక మూవీ ఆర్టిస్టుల సంఘం ఆ ఇద్దరి కనుసన్నల్లో మెలిగేలా ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా? అన్నది వేచి చూడాలి.
దాదాపు రూ.5కోట్ల మేర ఫండ్ ఉన్న మా ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. 1 కోటి ఫండ్ తో మొదలై మెగా ఈవెంట్ తర్వాత ఇంత పెద్ద మొత్తానికి ఫండ్ రైజ్ అయ్యింది. మా సొంత భవంతి నిర్మాణం కోసం ఈ నిధిని ఖర్చు చేస్తారు. ఇక `మా`లో ఆధిపత్య పోరునకు కారణం.. పేరు కోసం... గౌరవం కోసం... ఇదంతా.. సాగుతోందన్న ముచ్చటా సాగుతోంది. ఈ వర్గ పోరుకు చెక్ పెట్టి `మా` పరువు మర్యాదలు కాపాడే దిశగా చిరు - నాగార్జున ద్వయం ఏవైనా చర్యలు చేపడుతున్నారా? అన్నది వేచి చూడాల్సిందే.