సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన `సరిలేరు నీకెవ్వరు` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 5న ఎల్.బి స్టేడియంలో జరిగే ఈ వెంట్ కు పెద్ద ఎత్తున మహేష్ అభిమానులు.. మెగాభిమానులు తరలి రానున్నారు. ఇక అలనాటి హీరోయిన్ విజయశాంతి కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాజకీయంగాను తెలంగాణలో బాగా పాపులర్ అయిన నేత. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులున్నారు. రాములమ్మ పై ఫ్యాన్స్ అభిమానానికి సరిహద్దు అన్నదే లేదు.
అందుకే సరిలేరు ఈవెంట్ కి లెక్క లేనన్ని పాస్ లు ప్రింట్ చేసారట. వాటికి సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం గ్రౌండ్ సామార్ధ్యం ఎక్కువే కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని యూనిట్ ధీమాగానే ఉందిట. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఉండనుంది. ఆ విషయం పక్కనబెడితే ఒకే వేదికను మెగాస్టార్ చిరంజీవి- లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పంచుకోవడం ఉత్కంఠ పెంచుతోంది. గతంలో ఇద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించారు. గ్యాంగ్ లీడర్-పసివాడి ప్రాణం- కొండవీటి దొంగ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ తో ఈ జంటకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. రఫ్ అండ్ టఫ్ పాత్రలో చిరు-విజయశాంతి ఒదిగిపోయిన వైనం ఫ్యాన్స్ మర్చిపోలేరు. విజయ శాంతితో చిరు రొమాన్స్ ట్రెండ్ సెట్టర్. ఇక ``చెయ్యి చూసావా? ఎంత రఫ్ గా ఉందో? రఫ్ఫాడించేస్తా`` అంటూ చిరు డైలాగులు చెప్పే సీన్స్ గుర్తుకొస్తాయి ఫ్యాన్స్ కు. బెస్ట్ మెగానాయికగా విజయశాంతికి గుర్తింపు ఉంది. అందుకే ఈ ఉత్కంఠ.
రాజకీయంగా పార్టీలు వేరయినా ఏ రోజూ చిరంజీవిని ఉద్దేశించి విజయశాంతి గానీ.... ఆమెను ఉద్దేశించి చిరు గానీ ఎక్కడా చెడు విమర్శలు చేసిన సందర్భాలేవీ లేవు. రాజకీయాల పరమైన వ్యాఖ్యలు తప్ప కక్షపూరిత వ్యవహారం ఆ ఇద్దరి మధ్యా లేదు. అందుకే ఆ ఇరువురి స్నేహం ఇప్పటికీ స్చచ్ఛంగానే ఉంది. 13 ఏళ్ల తర్వాత రాములమ్మ కు సరిలేరు రీ ఎంట్రీ మూవీ కావడం.. ఆ సినిమా ఈవెంట్ కి చిరు అతిథి కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. జనవరి 5న తన గురించి మెగాస్టార్ ఎలా స్పందిస్తారో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇటు చిరు.. అటు విజయశాంతి ఫ్యాన్స్ లో దీనిపై ఆసక్తి నెలకొంది. ఇక చిరు ఛాన్సిస్తే ఆయన సినిమాల్లో నటించాలనుందని విజయశాంతి ఇప్పటికే ఫీలర్స్ వదిలిన సంగతి తెలిసిందే.