అభిమానం వల్ల 'చిరు' ఇబ్బంది

Update: 2018-01-25 13:53 GMT
తమ సినిమా ప్రమోషన్ కోసం అభిమానంతో ఎవరు పిలిచినా కాదనకుండా హాజరవుతున్న చిరుని తమకు తెలియకుండానే కొంత ఇబ్బంది కలిగించేలా నాగ శౌర్య ఛలో నిర్మాతలు వ్యవహరించడం ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారింది. మరికాసేపట్లో జరగనున్న ఛలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్న సంగతి తెలిసిందే. దీని గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హంగామా జరుగుతోంది. చిరు వస్తున్నాడు అంటే మెగా ఫాన్స్ కు ఆసక్తి కలుగుతుంది కాబట్టి పోస్టర్స్ లో చిరు రాకను బాగా హై లైట్ చేస్తూ వచ్చారు. అందరిలాగా మామూలుగా చేస్తే ఎలా అనుకున్నారో ఏమిటో చిరంజీవి పేరుకు ముందు పద్మభూషణ్ అని చేర్చి మరీ పబ్లిసిటీ చేయటంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి పద్మభూషణ్ గ్రహీతలు ఎవరైనా సరే తమ పేరు మీద ఉన్న పొందిన ఈ పురస్కారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడకూడదు.

గతంలో దేనికైనా రెడీ సినిమా టైటిల్ కార్డ్స్ లో నిర్మాత మోహన్ బాబు పేరు ముందు ఇలాగే చేస్తే నానా రచ్చ జరిగి కోర్ట్ సీరియస్ అయ్యే దాకా వచ్చింది మ్యాటర్. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేయనప్పటికి విమర్శలు చేయడానికే కాచుకుని ఉన్న కొన్ని వర్గాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నిజానికి చిరు సైతం అధికార పురస్కారమైనా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడు వాడలేదు. ఇప్పుడు తనకు చెప్పకుండానే ఛలో మేకర్స్ ఈ పొరపాటు చేసుండొచ్చు. అసలే సోషల్ మీడియా యమా యాక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సెలెబ్రిటీల సంగతులు వలువలు చిలువలు చేసి మరీ ప్రచారం చేస్తున్న వారికి కొదవే లేదు. అలాంటప్పుడు జాగ్రతగా ఉండటం చాలా అవసరం.2006లో పద్మభూషణ్ పురస్కారం పొందినప్పుడు చిన్నపాటి వివాదాలు కూడా అప్పట్లో రేగాయి. ఈ రోజు ఛలో వేడుకకు చిరు రావడం బాగా ప్లస్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటివి కాస్త చికాకు కలిగించేవే.

ఛలో ఫిబ్రవరి 2న విడుదల కానుంది. రవితేజ టచ్ చేసి చూడు తో పోటీ పడనున్న ఛలో ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. కన్నడ సూపర్ హిట్ మూవీ కిర్రాక్ పార్టీ లో నటించిన రష్మీక మండన్న దీని ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతోంది. మణిశర్మ వారసుడు మహతి సంగీతం దీనికి మరో ప్రధాన ఆకర్షణ.
Tags:    

Similar News