మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన రెండు దశాబ్దాల నెం.1 స్టార్‌డమ్ ను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లడంను కొందరు సాహసంగా అంటూ ఉంటారు.. మరి కొందరు తెలివి తక్కువ నిర్ణయంగా అభివర్ణిస్తూ ఉంటారు.
కొందరు మాత్రం రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత బయటకు రావడం అనేది తొందరపాటు చర్య అంటూ కొందరు చిరంజీవిని గురించి కామెంట్స్ చేయడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం.
సినిమా ల్లో నటిస్తున్న సమయంలో ఇతర వ్యాపకం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది చిరంజీవి అభిప్రాయం. అందుకే ఇటీవల అల్లు రామలింగయ్య యొక్క వందవ జయంతి ఉత్సవాల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అరగంట పాటు ఆసక్తిగా సాగిన చిరంజీవి స్పీచ్ పలు సార్లు నవ్వులు పూయించింది. అక్కడున్న వారి మొహాల్లో చిరు నవ్వు కలిగేలా చేసింది.
చిరంజీవి మాట్లాడుతూ.. ఆర్టిస్టు గా సెటిల్ అయిన తర్వాత మరో వ్యాపకం వైపో లేదా వ్యాపారం వైపో నేను వెళ్లను అంటూనే... రాజకీయాల్లోకి వెళ్లావు కదా అని మీరు అడగొద్దు.. అది మధ్యలో ట్రై చేశాను.. దాన్ని గురించి మీరు వదిలేసేయండి అంటూ సరదాగా రాజకీయాలను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. మధ్యలో ట్రై చేశాను.. వర్కౌట్ కాలేదు వదిలేశాను అన్నట్లుగా చిరంజీవి వ్యాఖ్యలు ఉన్నాయనే టాక్ మొదలు అయ్యింది.
ఆ విషయం పక్కన పెడితే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 5వ తారీకున దసరా సందర్భంగా విడుదల కాబోతున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.
అంతే కాకుండా నయనతార.. సత్యదేవ్ లు కూడా సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాధ్ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.