ఫాలోయింగ్ లో నేషనల్ క్రష్ దీపికనే మించిపోతుందా!
సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి ఐశ్వర్యా రాయ్ రేంజ్ లో ఫేమస్ అయింది దీపిక మాత్రమే. సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే నటిగానూ ఎదిగింది.
బాలీవుడ్ లో టాప్ 5 లిస్ట్ తీస్తే అందులో దీపికా పదుకొణే ఒకరు. ఐశ్వర్యా రాయ్ రేర్ గా సినిమాలు చేయడం.. ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిపోవడంతో? దీపికా పదుకొణే మరింత వెలుగులోకి వచ్చింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, అలియా భట్ లాంటి భామలున్నా? వాళ్లను మించిన క్రేజీ బ్యూటీగా దీపికా పదుకొణేకి పేరుంది. సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి ఐశ్వర్యా రాయ్ రేంజ్ లో ఫేమస్ అయింది దీపిక మాత్రమే. సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే నటిగానూ ఎదిగింది.
వందల కోట్ల ప్రాజెక్ట్ ల్లో భాగమవుతోంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. మరి భవిష్యత్ లో దీపికను మించిన ఫాలోయింగ్ నేషనల్ క్రష్ రష్మికా మందన్నాకు సాధ్యమవుతుందా? అంటే అవుననే అనాలి. రష్మిక `పుష్ప`తో పాన్ ఇండియాలో వెలుగులోకి వచ్చింది. అటుపై రిలీజ్ అయిన `యానిమల్` తో మరింత ఫేమస్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన `పుష్ప-2` తో ఆ క్రేజ్ రెట్టింపు అయింది. స్టార్ హీరోలే రష్మికతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మూడేళ్ల క్రితమే `గుడ్ బై`తో బాలీవుడ్ లో లాంచ్ అయింది. అటుపై `మిషన్ మజ్ను` లో భాగమైంది. తాజాగా `ఛావా`లోనూ నటించింది. శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో ఏసుబాయిగా మెప్పించ బోతుంది. `తామా`లోనూ ఛాన్స్ అందుకుంది. ఇలా నటిగా బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది. సినిమా లైనప్ పక్కన బెడితే నార్త్ లో క్రేజీ బ్యూటీగా మారింది. టాలీవుడ్ తరహాలోనే తనదైన చలాకీతనంతో అక్కడా ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
మరిన్ని విజయాలు అమ్మడిని అక్కడ మరింత క్రేజీ బ్యూటీగా మార్చే అవకాశం ఉంది. ఇలా రష్మికకు సౌత్ సహా నార్త్ లో ఫాలోయింగ్ రెట్టింపు అవుతుంది. కానీ దీపిక పదుకొణే కేవలం నార్త్ వరకే పరిమితవుతుంది. సౌత్ లో ఆమెకు అంత క్రేజ్ లేదు. ఇప్పుడిప్పుడే సౌత్ లో ఫేమస్ అవుతోంది. దీపిక, రష్మిక ఇద్దరు బెంగుళూరు నుంచి బాలీవుడ్ కి వెళ్లి సంచలనం అవ్వడం గొప్ప విషయం. ఐశ్వర్యారాయ్ కూడా బెంగుళూరు నుంచే బాలీవుడ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.