పిల్లలు కనాలంటే భర్తతో పన్లేదు.. సీరియల్ నటి సెన్సేషనల్ కామెంట్స్!
బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టీనా దత్తా బుల్లితెరపై ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే.
హీరోహీరోయిన్లంతా మెల్లిగా తమ సింగిల్ లైఫ్ ను వదిలేసి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరికొందరు వివాహ బంధానికి గుడ్ బై చెప్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టీనా దత్తా బుల్లితెరపై ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే.
కలర్స్ టీవీ ఉత్తరన్ సీరియల్ తో బాగా పాపులరైన టీనా దత్త ప్రస్తుతానికి సింగిల్ గానే ఉంది. ఫ్యూచర్ లో కూడా తనకు ఎవరితో కలిసే ఆలోచన లేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి టీనా రీసెంట్ గా మాట్లాడింది. సింగిల్ గా తల్లి కావడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, తల్లి కావడానికి పెళ్లి చేసుకోనక్కర్లేదని టీనా అంటోంది.
పెళ్లి చేసుకోవడానికి కూడా తాను తొందరపడట్లేదని, కానీ ఫ్యూచర్ లో మాత్రం దత్తత తీసుకునో లేదా సరోగసీ ద్వారానో తల్లి కావాలని చూస్తన్నట్టు టీనా తెలిపింది. తాను మంచి తల్లిని కాగలనని నమ్ముతున్నానని, సరైన టైమ్ వచ్చినప్పుడు తాను మంచి తల్లిగా ప్రూవ్ చేసుకుంటానని టీనా దత్తా చెప్పుకొచ్చింది.
సుస్మితా సేన్‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్తున్న టీనా, ఆమె ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకోవడం చూసే తాను కూడా ఆ దారిలో వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపింది. అయితే తను ఏ నిర్ణయం తీసుకున్నా తన తల్లిదండ్రుల మద్దతు ఉంటుందని, ఫ్యూచర్ లో సరోగసీ లేదా దత్తత తీసుకుని పిల్లలకు తల్లినైనా తన తల్లిదండ్రులు ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తారని టీనా ఈ సందర్భంగా వెల్లడించింది. భర్త అవసరం లేకుండానే పిల్లల్ని కనగలనని, పెంచగలనని టీనా అభిప్రాయపడింది.