మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ఖైదీ నంబర్ 150 మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇటు సినిమా సంగతులతో పాటు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వీటికి తన స్టైల్ లో సున్నితంగానే చిరు జవాబులు ఇచ్చినా.. వాటిలో ఎన్నో పదునైన మాటలు ఉన్నాయి.
నాగబాబు ఆరోజున అలా మాట్లాడ్డం గురించి మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న చిరుకు ఎదురైంది. దానికి సమాధానమిస్తూ.. 'నాకూ అది సర్ ప్రైజింగే. తను ఎందుకు అలా అన్నాడు అనేందుకు.. మేము అందరం కూర్చున్నపుడు ఆయా సందర్భాల్లో ఆయా కామెంట్స్ ప్రస్తావనకు వస్తాయి. అపుడు అన్యాపదేశంగా ఇలా ఎందుకు అంటారు? మనం ఏదైనా మాట మాట్లాడితేనో.. లేక వాళ్లను హర్ట్ చేసే విధంగా అంటేనో లేక అనవసరంగా కామెంట్ చేస్తోనో.. తిరిగి వాళ్లు ఇలా మాట్లాడ్డం సబబు. దాన్ని న్యాయమే. కానీ ఈ రకంగా కామెంట్ చేయడానికి వాళ్లకి మనం సాఫ్ట్ టార్గెట్ లాగా దొరికామా ఏంటి? ఏంటిది? ఎందుకిలా చేస్తారు.. ఎవరూ ఇలా మాట్లాడలేదే అని మాకు హర్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒక చోటకు చేరేసరికి నాగబాబు అలా మాట్లాడి ఉండొచ్చు. నేనైతే కనుక వాటిని వింటాను. ఫీలింగ్ ఫీలింగే.. కానీ వాటిని తుడిచిపెట్టేస్తాను' అన్నారు చిరంజీవి.
యండమూరి నుంచి వచ్చి స్పందనపై కూడా చిరు రియాక్ట్ అయ్యారు. 'ఆయన చెప్పినవి నేను టీవీల్లో చూశాను. నేనేమన్నాను.. అంటున్నారాయన. కానీ ఆయన అన్నదాంట్లో.. వ్యక్తిత్వ వికాసం క్లాసులు తీసుకుంటున్నపుడు.. ఒకళ్ల గురించి చెప్పేటపుడు.. మంచి ఉంటుంది.. చెడు ఉంటుంది. కానీ.. ఒకళ్లను ఇన్ స్పైర్ చేయడం కోసం ప్రభావితం చేయడం కోసం ఒక వ్యక్తిలోని ఒక సెలబ్రిటీలోని మంచి క్వాలిటీస్ ని మాత్రమే మనం చెప్పుకోగలిగితే అది పాజిటివ్ గా ఉంటుంది. ఒకళ్లను గురించి తక్కువ చేసి ఇంకొకరి గురించి గొప్పగా చెప్పడం అయితే.. కంపేరిటివ్ గా ఒకళ్లను కించపరచడం అవుతుంది. కించపరిచే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? లేదూ.. మేం అంటాం అంతే అంటే అది మీ విచక్షణకే వదిలేయడమే' అంటూ రామ్ చరణ్ పై యండమూరి చేసిన కామెంట్స్ కు తన ప్రతిస్పందన తెలియచేశారు చిరంజీవి.
'అలాగే ఇంట్లో మహిళల గురించి పేరు ప్రస్తావించినపుడు.. సభాముఖంగా కనీస మర్యాదలుంటాయి. కనీసం అవి పాటించకుండా.. నా సతీమణి పేరు.. సురేఖ అలా అంది అనడం.. ఏం సంస్కారం అది? ఇంట్లో వాళ్లు కూడా ఏంటిదీ.. ఇంట్లో సొంతమనిషిని పిలిచినట్లుగా మాట్లాడ్డం ఏంటి అనుకున్నారు. సో ఆ సంస్కారం లేని పద్ధతిని నువ్వు సమర్ధించుకోవచ్చు. కానీ చూసేవాళ్లకు అర్ధమవుతుందిగా ' అని యండమూరిని ఉద్దేశించి చిరంజీవి అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/