మొత్తానికి ఎట్టకేలకు ‘ఖైదీ నెంబర్ 150’ ట్రైలర్ వచ్చేసింది. మెగా అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఉంది ఈ ట్రైలర్. రెండు నిమిషాల ట్రైలర్ నిండా చిరంజీవే హైలైట్ అయ్యాడు. ట్రైలర్ అంతా ఆయన చుట్టూనే తిరిగింది. మెగా అభిమానుల్ని ఉర్రూతలూగించే డైలాగు.. చిరంజీవి ఎనర్జిటిక్ డ్యాన్సులు, ఫైట్ల తాలూకు మెరుపులతో సాగింది ట్రైలర్. ‘‘పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది’.. ‘‘నాది వన్ వే.. కష్టం వస్తదో కార్పొరేట్ సిస్టం వస్తదో రమ్మను’’.. లాంటి డైలాగులు మాస్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి.
కానీ ఈ డైలాగుల్ని చిరు పలికిన తీరే కొంచెం తేడాగా ఉంది. ఒకప్పట్లాగా ఫ్రీ ఫ్లోతో డైలాగులు చెప్పలేదు చిరు. పట్టి పట్టి డైలాగులు చెబుతున్నట్లుగా అనిపించింది. వయసు ప్రభావం కావచ్చు లేక దశాబ్దం విరామం వల్ల కావచ్చు. డైలాగులు చెప్పడంలో ఒకప్పటి చిరు ఫ్లో ఇప్పుడు మిస్సయిందన్నది ట్రైలర్ చూసిన వాళ్లెవరైనా ఈజీగా చెప్పేస్తారు. ఐతే డ్యాన్సుల విషయంలో చిరు గ్రేస్.. ఎనర్జీ మాత్రం ఏమీ తగ్గలేదేమో అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. డ్యాన్స్ మూమెంట్స్ చూపించి చూపించనట్లు చూపించారు కానీ.. వాటితోనే చిరు ఎలా చెలరేగిపోయి ఉంటాడో అర్థమైపోయింది అభిమానులకు. డైలాగులు చెప్పే విషయంలో మాత్రం ఏదో తేడా కొట్టినట్లే అనిపించింది. ట్రైలర్ వరకే డబ్బింగ్ అలా ఉందో.. సినిమా మొత్తానికి కూడా అలాగే డైలాగులు చెప్పారా లేక మార్పు చూపించారా అన్నది ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/