తాత అవ్వడమే బర్త్‌ డే గిఫ్ట్‌

Update: 2015-08-22 17:01 GMT
మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌ లో ఘనంగా జరుగుతున్నాయి. ఒకరోజు అభిమానుల కోసం, మరొకరోజు హైప్రొఫైల్‌ సెలబ్రిటీల కోసం వేడుకల్ని ఎక్స్‌టెంట్‌ చేశారు. వీలునుబట్టి సెపరేట్  సెలబ్రేషన్స్‌ ప్లాన్‌ చేశారు. జీవితంలో 60 వసంతాలు పూర్తయిన వేళ.. ఇది అత్యంత కీలకమైన బర్త్‌ డే. అందుకే ఇలా ప్రతిదీ ప్లాన్డ్‌ గా వైభవంగా చేస్తున్నారు. అయితే ఇంత ఘనంగా పుట్టినరోజు చేసుకుంటుంటే చరణ్‌ నుంచి కానీ, కోడలు ఉపాసన నుంచి కానీ చిరు ఎలాంటి గిఫ్ట్‌ కోరుకుంటున్నారు? అన్న సందేహం అభిమానులకు రావొచ్చు. ఇదే ప్రశ్న చిరునే అడిగితే ఏమన్నారో తెలుసా?

నేను ఉపాసనకు ఒకటే చెబుతాను. మీరంతా ఇలాంటి బోలెడన్ని గిఫ్ట్‌ లు తెచ్చి ఇస్తున్నారు. వీటన్నిటి బదులుగా ఓ గ్రాండ్‌ చైల్డ్‌ ని కానుకగా ఇవ్వండి అని చెబుతుంటా.. అని నవ్వేశారు చిరు. మెగాస్టార్‌ లోని ఈ ఉత్సాహం చూస్తుంటే చరణ్‌ అర్జెంటుగా ఓ బుల్లి చెర్రీని కనేస్తే ఆ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలని చిరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారనిపిస్తోంది. ఆ శుభవార్త కాస్తా ఉపాసన ఎప్పుడు చెబుతుందో మరి.
Tags:    

Similar News