చిరు న‌టించిన బాగ్ధాద్ గ‌జ‌దొంగ ఇన్నాళ్టికి ఓటీటీలో?

Update: 2020-10-23 01:30 GMT
నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `న‌ర్త‌న‌శాల‌`. గ‌త కొన్నేళ్ల క్రితం ప్రారంభ ద‌శ‌లోనే ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఓటీ‌టీలో రిలీజ్ చేస్తున్నారు. కేవ‌లం 17 నిమిషాల ఫుటేజీని శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల బాల‌య్య స్వ‌యంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీని ద్వారా వ‌చ్చే మొత్తంలో కొంత భాగాన్ని చారిటీకి అంద‌జేయ‌‌బోతున్నారు. ఇక ఇప్ప‌టికే ట్రైల‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది.

ఇదిలా వుంటే ఇదే త‌ర‌హాలో మ‌ధ్య‌లో ఆగిపోయిన మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `అబు బాగ్దాద్ గ‌జ‌దొంగ‌` ని కూడా రిలీజ్ చేస్తారా అనే చ‌ర్చ మొద‌లైంది. మెగా ఫ్యాన్స్ ఈ మూవీకి సంబంధించిన క్లిప్స్ ని ఇప్ప‌టికైనా రిలీజ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో 90వ ద‌శ‌కంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. ఇండియ‌న్ టెక్నీషియ‌న్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ క‌లిసి వ‌ర్క్ చేసి తొలి భార‌తీయ చిత్ర‌మిది. అప్ప‌ట్లోనే పాన్ ఇండియా స్థాయిలో 50 కోట్ల భారీ వ్య‌యంతో ఈ మూవీని ప్లాన్ చేశారు.

చిరు గెట‌ప్ కాస్ట్యూమ్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. అయితే కొంత మంది ముస్లీమ్ నేత‌ల ఒత్తిళ్ల కార‌ణంగా ఈ మూవీ అర్థాంత‌రంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇప్ప‌టికీ దీనికి సంబంధించిన ఎలాంటి క్లిప్ బ‌య‌టికి రాలేదు. ఈ మూవీని పూర్తి చేయాల‌ని చిరు డ్రీమ్ కానీ అది నెర‌వేర‌లేదు. రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని మ‌ళ్లీ రివైవ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా చిరులో మార్పులు రావ‌డంతో ఇది అసాధ్య‌మ‌ని ప‌క్క‌న పెట్టేశారు. అయితే `న‌ర్త‌న‌శాల‌` ఫుటేజ్ ‌ని రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో `అబు బాగ్దాద్ గ‌జ‌దొంగ‌` నుంచి ఏదైనా గుడ్ న్యూస్ వినిపిస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి వారి క‌ల నెర‌వేరుతుందో లేదో తెలియాలంటే చిరు స్పందించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News