5 గంటలు నిలుచునే.. దటీజ్‌ మెగాస్టార్‌

Update: 2015-07-22 05:49 GMT
గొప్పవాళ్లు అవ్వాలంటే కొన్ని స్పెషల్‌ క్వాలిటీస్‌ ఉండాలంటారు. అలాంటి క్వాలీటీస్‌ లో ప్రథమంగా ఉండాల్సింది సహనం, ఓపిక. ఇది ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. అసలు వరప్రసాద్‌ అను ఓ కుర్రాడు చిరంజీవి అవ్వడం వెనక, చిరంజీవి సుప్రీం హీరోగా, మెగాస్టార్‌ గా అవతరించడం వెనక ఎంతో కృషితో పాటు సహనం, ఓరిమి, ఇతరుల్ని గౌరవించే గొప్ప లక్షణం, ఎదిగినా ఒదిగి ఉండే అరుదైన గుణం ఉన్నాయని చెబుతారు. గొప్ప సహనశీలి కాబట్టే చిరు అంతటివాడయ్యాడని పరిశీలకులు చెబుతారు.

అదే సంగతిని ఇటీవలే ఓ అవార్డుల వేడుకలో మరోమారు నిరూపించారు మెగాస్టార్‌. టీఎస్పార్‌ అవార్డు వేడుకలు మొన్నటి ఆదివారం హైదరాబాద్‌ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో బోలెడుమంది తెలుగు హీరోలు వేదికని అలంకరించినా ఎవరికి వారు తమ అవార్డులు అందుకుని పనైపోయిందే అన్నట్టు అక్కణ్ణుంచి వెళ్లిపోయారు. కానీ చిరంజీవి అలా చేయలేదు. అతడు దాదాపు 5గంటల పాటు ఎంతో ఓపిగ్గా వేచి చూసి అతిధుల్ని వేదికపైకి స్వయంగా ఆహ్వానించి, అవార్డులందించి అంతా తానే అయ్యి ఇన్ని పనులు చేశాడు.

బాలీవుడ్‌ నుంచి శత్రుఘ్న సిన్హా, రిషీకపూర్‌, శక్తి కపూర్‌, రవీనాటాండన్‌ ఇంతమంది సీనియర్‌ నటులు వచ్చారు. వారిని గౌరవించడానికి, సత్కరించడానికి టాలీవుడ్‌ తరపున నేనున్నా అని నిరూపించారాయన. అందరిలాగే ఆలోచించి ఉంటే.. కానీ అలా చేయలేదు. దటీజ్‌ చిరంజీవి. అందుకే అతడు మాత్రమే టాలీవుడ్‌ నెం.1 అనిపించుకోగలిగాడు. ఇదే వేడుకలో మోహన్‌ బాబు, బాలయ్యబాబు తదితరులు అవార్డులు అందుకున్నారు.
Tags:    

Similar News