తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం అక్కినేని కోడలు సమంత 'సామ్ జామ్' అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా స్ట్రీమింగ్ కు పెట్టిన ఈ ఎపిసోడ్ లో చిరంజీవి తన కెరీర్, వ్యక్తిగత జీవితం, రాజకీయాలు.. మొదలైన అంశాలతో పాటు పలు ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు. అందులో అన్ సీన్ క్లిప్పింగ్స్ ని ఆహా టీమ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ వస్తోంది. ఈ సందర్భంగా 'మీకు లైఫ్ ని రివైండ్ చేసే అవకాశం వస్తే మీరు దేన్ని మార్చాలనుకుంటారు?' అని సమంత ప్రశ్నించగా.. దీనికి చిరంజీవి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'ఒకవేళ నిజంగానే ఆ అవకాశం వస్తే.. సరిగ్గా ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళి చైనాలో కరోనా వైరస్ లీక్ అయిందని చెప్తున్న బిల్డింగ్ ను భూస్థాపితం చేసి ఆ వైరస్ ను బయటకు రాకుండా చేయాలనేది నా కోరిక' అని చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో తాను జయాపజయాలను పెద్దగా పట్టించుకునేవాడిని కాదని.. అయితే 'వేట' సినిమా ఫ్లాప్ అయినందుకు మాత్రం వెక్కి వెక్కి ఏడ్చానని చిరు తెలిపారు. అలానే తన కెరీర్ ను మలుపు తిప్పిన 'ఖైదీ' సినిమా తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన 'వేట' సినిమా ప్లాప్ అయిందని.. ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో దుప్పటి కప్పుకుని వెక్కివెక్కి ఏడ్చానని చెప్పారు. 'శంకరాభరణం' సినిమా క్లైమాక్స్ చూసి కూడా కన్నీళ్లు పెట్టుకున్నానని కూడా మెగాస్టార్ ఈ సందర్భంగా వెల్లడించారు.