మెగాస్టార్ చిరంజీవి.. దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు మకుటం లేని మహారాజుగా నిలిచిన కథానాయకుడు. మహేష్ బాబు లాంటి ఈ తరం సూపర్ స్టార్ కూడా చిరంజీవి స్థానం భర్తీ చేయలేనిదని.. తెలుగు సినిమాలో 1 నుంచి 10 స్థానాలు ఆయనవే అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకప్పుడు. అలాంటి హీరో.. కొన్నేళ్లు వెండి తెరకు దూరమై.. మళ్లీ తిరిగి వచ్చిన సమయంలో తనను ఈ తరం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాడట. ఐతే అలాంటి భయంతో ఉన్న తనకు ‘ఖైదీ నంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చిరు చెప్పాడు. జీ టీవీ సినిమా అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ చిరు ఈ విషయాన్ని వెల్లడించాడు.
తాను తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని.. తాను సినిమాల నుంచి నిష్క్రమించే సమయానికి చిన్న పిల్లలుగా ఉన్న వాళ్లు.. తాను రీఎంట్రీ ఇచ్చే సమయానికి యూత్ అయ్యారని.. మరి వాళ్లు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కంగారు పడ్డానని చిరు చెప్పాడు. ఐతే ‘ఖైదీ నంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అభిమానుల్లో ఈ తరం యువతే ఎక్కువగా కనిపించారని.. వాళ్లను చూశాక ఇప్పటి యువ ప్రేక్షకులు కూడా తనను అభిమానిస్తున్నారని.. బాగానే రిసీవ్ చేసుకుంటారని తనకు నమ్మకం కలిగిందని.. ఆత్మవిశ్వాసం వచ్చిందని చిరు చెప్పాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’ అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టి ‘నాన్-బాహుబలి’ రికార్డుల్ని బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే.