మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ప్రస్తుతం 'ఆచార్య' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మరో స్టార్ హీరో నటిస్తున్నారని చాలా రోజుల నుండి చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈమధ్య ఆ పాత్రలో మహేష్ బాబును నటింపజేసేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నారని.. మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో మహేష్ నటించడం కుదిరేలా లేదని అంటున్నారు.
మహేష్ ఏదైనా సినిమాలో నటిస్తే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. అయితే మెగాస్టార్ సినిమాలో మహేష్ నటించినప్పటికే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుందేమో కానీ బిజినెస్ లెక్కల పరంగా చూసుకుంటే మాత్రం పెద్దగా బెనిఫిట్ ఉండదని అభిప్రాయపడుతున్నారట. చిరు సినిమాకు సాధారణంగానే భారీ మార్కెట్ ఉంటుంది. అలాంటప్పుడు మహేష్ రెమ్యూనరేషన్ తో సినిమా బడ్జెట్ అనవసరం గా పెరుగుతుందనే భావనలో ఉన్నారట.
అంతే కాకుండా ఈ సినిమాలో మహేష్ నటిస్తాడు అనే వార్త వచ్చినప్పటి నుంచి ఫోకస్ అంతా మహేష్ పైనే ఉందని.. ఇది మహేష్ సినిమాలా మారిపోతుందని కూడా ఒక అభిప్రాయం వినిపిస్తోంది. ఇవన్నీ ఆలోచిస్తున్న మెగా క్యాంపు.. మహేష్ అతిథి పాత్రపై ఆలోచనలో పడిందట. అయితే కొరటాల మాత్రం మహేష్ కే ఓటు వేస్తున్నారట. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.