గత సంవత్సరంలో తన పుట్టినరోజున మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా గురించి ప్రకటిస్తారని అందరూ ఆలా ఆసక్తిగా ఎదురు చూశారు. కాకపోతే స్టోరీ సెట్టవ్వలేదు అంటూ చరణ్ చెప్పడమే కాని చిరు ఏమీ చెప్పలేదు. ఇక బర్త్‌డే వచ్చేసరికి ఆయన విమానం ఎక్కేసి నేపాల్ వెళ్ళిపోయారు. అక్కడ ఓ పురాతన శివాలయంలో పూజలు చేయించి.. మరుసటి రోజు తిరిగొచ్చారు. అభిమానులను కలసి వారికి సినిమా గురించి ఏమీ చెప్పలేదు. ఇది గత సంవత్సరం.
చూస్తుండానే 2014 అంతా గడచిపోయింది. 2015 రానే వచ్చింది. డిసెంబర్‌లో చిరంజీవి సినిమా గురించి చెబుతారని అనుకుంటే 2014 మే నెలలో ఫైనల్‌గా చెవిలో అమృతం పోశాడు రామ్‌చరణ్. స్పీడ్ డైరక్టర్ పూరి డైరక్షన్‌లో ''ఆటో జానీ'' సినిమాను తీయనున్నట్లు చెప్పేశాడు. డాడీ ఈజ్ రెడీ అంటూ మనోడు చెబితే.. కింగ్ ఆప్ సినిమా ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ పండుగ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అయ్యింది. కాని ఇంతవరకు చిరంజీవి ఈ సినిమాపై ఒక్క మాట కూడా చెప్పలేదు. కట్ చేస్తే.. అసలు ఆయన తన ఆకారాన్నే మార్చుకోవట్లేదు. సినిమాలు లేకపోవడం వలన కాస్త లవెక్కిన చిరంజీవి, ఏదో ఒకటి చేసి సన్నబడతారని అందరూ అనుకున్నారు. కేరళ మసాజ్‌లు అని కొందరు చెబితే, లైపోసక్షన్ అని కొందరు అన్నారు. అయితే చిరంజీవి ఇటు కేరళ వెళ్లారు, అటు అమెరికా వెళ్ళారు కాని మనిషి మాత్రం అలాగే ఉన్నారు. ఆయన్ను చూస్తుంటే అసలు ఇప్పడప్పుడే 150వ సినిమా మొదలవుతోందా అనే సందేహాలు వచ్చేస్తున్నాయ్ మరి.