"ఇదేంటీ, గత కొద్దిరోజులుగా దాసరి నారాయణరావు ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి మెగాస్టార్ చిరంజీవితో ఏం గొడవపడ్డారు? మీసం ఎందుకు మెలేశారు?" అనేగా సందేహం! అదేం లేదు.. ఆయన చాలా సంతోషంగా మీసం మెలేశార్లెండి. అది కూడా చిరు ఎదురుగా తనదైన సంతోషాన్ని అలా వ్యక్తపరుస్తూ చేశారు!
విషయానికొస్తే... కిమ్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావును పరామర్శించడానికి మెగాస్టార్ చిరంజీవి గురువారం వెళ్లారు. అనంతరం ఆ విషయాలను మీడియాతో పంచుకున్నారు చిరు. ఈ సందర్భంగా... "ఐసీయూలో ఉన్న దాసరి నారాయణరావు నన్ను సాదరంగా ఆహ్వానించారు.. ఆయన ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేరు.. అందుకే ఓ కాగితం తీసుకుని ఖైదీ నం.150 సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయని దానిపై రాసి నాకు ఇచ్చారు.. దానికి నేను... రూ.150 కోట్లు దాటాయి అని చెప్పాను.. వెంటనే ఆయన రూ.250 కోట్లు దాటుతాయని తన మీసం మెలేసి గర్వంగా చెప్పారు.. దాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను" అని సంబరంగా చెప్పారు చిరంజీవి.
ఈ సందర్భంగా దాసరి గురించి మాట్లాడిన చిరు... "ఆయనో పోరాట యోధుడు. ఆయన ఆత్మవిశ్వాసమే ఆయనను ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి బయటకు నడిపిస్తుంది.. మహా అయితే మరో రెండు మూడు రోజులు ఆయన ఐసీయూలో ఉండాలి.. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు.. మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారు.. ఖైదీ నం.150 ఇంత భారీ విజయం సాధించిన నేపథ్యంలో మేం భారీ బహిరంగ సభను నిర్వహించాలనుకుంటున్నాం.. దానికి ఆయన తప్పకుండా హాజరవుతారు" అని అన్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/