మెగాస్టార్ చిరంజీవితో అభిలాష.. మరణ మృదంగం.. రాక్షసుడు లాంటి ఎన్నో హిట్ సినిమాలు తీసిన సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు. రామారావు నిర్మాణంలో చిరు సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ కథ అందిస్తే.. కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేసేవారు. అప్పట్లో ఈ కాంబినేషన్ కు సూపర్ క్రేజ్ ఉండేది. ఐతే తర్వాత తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చిరు వేరే నిర్మాతల వైపు వెళ్లిపోయారు. కె.ఎస్.రామారావు వేరే వాళ్లతో సినిమాలు చేశారు. పాతికేళ్లకు పైగా వీళ్ల కాంబినేషన్లో సినిమానే లేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా నిర్మించడం ద్వారా తిరిగి మెగా కాంపౌండ్లోకి అడుగుపెట్టారు రామారావు. త్వరలోనే ఆయన బేనర్లో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నటించబోతున్నాడట. ఈ విషయాన్ని ‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో వేడుకలో చిరునే స్వయంగా ప్రకటించాడు.
ఈ నిర్ణయం చరణే తీసుకున్నట్లు కూడా చిరు వెల్లడించడం విశేషం. కొన్ని రోజుల కిందట తాను చరణ్ కలిసి డైనింగ్ టేబుల్ పై కూర్చుని భోం చేస్తుండగా.. అనుకోకుండా కె.ఎస్.రామారావు ప్రస్తావన వచ్చిందని చిరు వెల్లడించాడు. అప్పుడు చరణ్ తనంతట తానుగా రామారావుతో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పినట్లు చిరు తెలిపాడు. కె.ఎస్.రామారావు ఎప్పుడూ కామ్ గా తన దగ్గరికి వస్తారని.. ఆశీర్వదించి వెళ్తారని.. తాను పుట్టకముందు నుంచే మీతో ఆయనకు స్నేహం ఉందని.. ఆయన అభిరుచి ఏంటో తనకు తెలుసని.. కాబట్టి ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నానని చరణ్ తనకు చెప్పినట్లు చిరు వెల్లడించాడు. తాను ఇప్పటిదాకా కథ.. దర్శకుడు కుదిరాక నిర్మాత ఎవరో చూసుకుని సినిమాలు చేశానని.. కానీ తొలిసారిగా నిర్మాతను ఫిక్స్ చేసుకుని తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలనుకుంటున్నట్లు కూడా చరణ్ చెప్పినట్లు మెగాస్టార్ తెలిపారు. రాజమౌళి సినిమా తర్వాత కె.ఎస్.రామారావుతోనే చరణ్ చిత్రం ఉంటుందని చిరు ప్రకటించాడు. ఈ విషయంలో చరణ్ ను ముందే మరోసారి అడిగానని.. పబ్లిగ్గా చెప్పబోతున్నానని.. తర్వాత వెనక్కి తగ్గకూడదని కూడా అన్నానని.. అలాంటిదేమీ లేదు ప్రకటించండి.. అంటూ చరణ్ ధీమాగా చెప్పాడని చిరు వెల్లడించడం విశేషం.