మామూలుగా రామ్ చరణ్ సినిమాలు ఎంత బ్యాడ్ గా వచ్చినా కూడా వాటిని ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని ఏదో ఒక మాయ చేసి సెట్ చేస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన గతంలో అలాగే రచ్చ - నాయక్ వంటి సినిమాలకు తన కత్తెర పదును రుచి చూపించారు. ఆ సినిమాలు వర్కవుట్ అవ్వడంతో దాదాపు ప్రతీ సినిమానూ చిరు చక్కగా ఎడిట్ చేసి చరణ్ కు కనీసం మినిమం యావరేజ్ సినిమా అయినాపడేలా చేస్తారని ఒక టాక్ ఉంది.
ఇకపోతే బ్రూస్ లీ విషయంలో మరి చిరు కత్తెర పడిందా? లేదా? ఆ సినిమాను చూస్తున్నంతసేపూ ఆయన కత్తెర పడినట్లు అసలు క్రిటిక్స్ కు ఏమాత్రం అనిపించలేదు. ఎందుకంటే సినిమా ఆద్యంతం అంత పేలవంగా సాగింది మరి. ఎట్లీస్ట్ చిరు కనుక ఎడిటింగ్ చేసుంటే.. సినిమా పేస్ ఓ రేంజులో ఉండేది. ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే.. అసలు చిరంజీవికి ఈ సినిమా ఏమాత్రం నచ్చలేదట. ఫస్టు కాపీని ఆయనకు ప్రివ్యూ చూపించినప్పుడే.. సెకండాప్ పావు గంట చూసి చిరు స్ర్కీనింగ్ నుండి లేచి వెళ్ళిపోయారట.
అంత ముందే ఆయన వాకౌట్ చేశారంటే.. సినిమా ఆడదు అని ఆయనకు తెలిసిపోయింది అనే అనుకోవాలి మరి. అందుకేనేమే అసలు చిరంజీవి ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం తాను క్యామియో చేసిన విషయం గురించి కూడా ఒక్క కామెంటూ చేయలేదు. ఫ్లాపు సినిమా అని తెలిసీ అభిమానులను ఎలా మోసం చేస్తారులే ఆయన.. మాటలు చెప్పి!!