ఉభయగోదావరి జిల్లాల్లో గోదారి ప్రవహించడం ఆ జిల్లాలు చేసుకున్న పుణ్యం. భారతదేశపు ధాన్యాగారం అని ఆ జిల్లాలకు పేరొచ్చింది గోదారి తల్లి వల్లనేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రస్తుతం గోదారి పుష్కరాలు సందర్భంగా ఈ జీవనదితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారాయన. ఈ నదితో నా అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చాలా విషయాలు చెప్పారు.
''నేను రాజమండ్రి వైఎన్ కాలేజీలో చదువుకున్న రోజుల్లో గోదారి గట్టునే ఓ గది అద్దెకు తీసుకుని అందులో ఉండేవాడిని. ఆ తర్వాత గోదారి గట్టున కూచునే అలవాటైంది. అక్కడ చల్లని గాలి పీలుస్తూ మధురమైన అనుభూతుల్ని ఆస్వాధించేవాడిని.. అంతర్వేది వెళ్లి అక్కడ నదిలో, సముద్రంలో స్నానమాచరించి లక్ష్మీ నరసింహ స్వామి గుడిని సందర్శిస్తే పుణ్యం, గొప్ప అనుభూతి కలుగుతుంది. వెన్నెల్లో గోదారి, వర్షంలో గోదారి, పాపికొండల్ని దాటుకుంటూ గోదారి తల్లి గలగలలు ఇవన్నీ.. ఎప్పటికీ మర్చిపోలేనివి..'' అన్నారు మెగాస్టార్.
ఇక ఈ తీరంలోని కళా సమ్మేళనం మాట్లాడుతూ.. ''గోదాని నదీ తీరం సాహితీ సేద్యానికి మూలం. అఖండ గోదారి గురించి ఎంతోమంది కవులు ఎన్నో కవితలు రాశారు. పుష్కరకాలంలో నదిలో స్నానమాచరించి హారతి తీసుకుంటే ఆ పుణ్యఫలం వంశవృక్షానికి చెందుతుందని పెద్దలు చెప్పేవారు. మన తాత ముత్తాతల వరకూ మనకు తెలుసు కానీ, అంతకంటే ముందుండే పూర్వీకులు మనకు తెలియదు. అందరికీ పుష్కరస్నానం వల్ల పుణ్యం వస్తుంది. సద్గతులు కలుగుతాయి'' అంటూ మెగాస్టార్ ఎన్నో విషయాల్ని చెప్పుకొచ్చారు.