‘కత్తి’ గొడవ ఏదో చిన్నదే అనుకున్నారు కానీ.. అది అంత తేలిగ్గా ఏమీ తెగేలా లేదు. ‘కత్తి’ కథ తనది అంటున్న రైటర్ నరసింహారావుకు మద్దతుగా మొత్తం రచయితల సంఘం అంతా నిలబడ్డమే కాదు.. వివాదం పరిష్కారమయ్యేవరకు ‘కత్తి’ రీమేక్ షూటింగ్ మొదలే కానివ్వమంటూ అల్టిమేటం విధించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చిరంజీవికి కుటుంబానికి ఎంతో సన్నిహితులైన పరుచూరి సోదరులిద్దరూ ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉండటం, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ తో పాటు కొందరు ప్రముఖులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ నరసింహారావుకు న్యాయం చేయకుండా ‘కత్తి’ సినిమా మొదలుపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేయడం గమనార్హం.
‘‘చిరంజీవి కత్తి సినిమాను రీమేక్ చేయబోతున్నందువల్ల ఈ సమస్య బయటపడలేదు. 16 నెలలుగా ఈ కథపై వివాదం జరుగుతోంది. గత ఏడాది మార్చిలో ‘కత్తి’ కథపై తెలుగు - తమిళ రచయితల సంఘాలు భేటీ అయ్యి సమస్యను ఓ దారికి తెచ్చాం. రచయితకు న్యాయం జరగాలని తీర్మానించాం. మా పోరాటం మురుగదాస్ మీదో - నిర్మాత మీదో కాదు. మొదట నరసింహారావు దగ్గర కథ విని... తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా కూరొచ్చిని ట్రావెల్ అయిన విజయ్ మీద. మురుగదాస్ దగ్గర కధ విన్నప్పుడు కూడా ‘ఈ కథ నేను వేరే రచయిత చెప్తే విన్నానని కూడా చెప్పకుండా విజయ్ నైతిక విలువలకు తిలోదకాలిచ్చాడు’’ అని పరుచూరి గోపాల కృష్ణ విమర్శించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘ఇటీవల చిరంజీవిగారిని కలిసి ఈ సమస్య గురించి మాట్లాడాను. ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. కథపై నడుస్తున్న సమస్యలన్నీ పరిష్కారమయ్యాకే సినిమా ప్రారంభించేలా రాంచరణ్ వాళ్లతో మాట్లాడాడని నాకు చెప్పారు’’ అని వెల్లడించారు.